Niharika Konedela : ఇప్పుడే చరణన్నని ముప్పు తిప్పలు పెడుతుంది.. – నిహారిక

Niharika Konedela : నిహారిక కొణెదల వరుస ఇంటర్వ్యూ లలో బిజీగా ఉంది. ,ఈగ డాటర్ నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆ ఇంటర్వ్యూ లోనే బిజీగా ఉంది. ఈ క్రమంలో తన గురించి ఫ్యామిలీ గురించి కూడా ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకారా కొణిదెల పుట్టినప్పటినుండి అన్ని శుభాలే జరుగుతున్నాయని మెగాభిమానులు సైతం అంటున్నారు. అన్నిటికీ మించి రామ్ చరణ్ తండ్రయ్యాక తన సంతోషం ఎన్నో రేట్లు పెరిగిందని తెలుస్తుంది. అలాగే ఈ మధ్య షూటింగ్ లో కంటే క్లింకారా కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. పలు సందర్భాల్లో కూడా క్లీంకారతో ఉంటే టైం తెలియట్లేదని, ఈ మధ్య షూటింగ్‌లు కూడా తొందరగా ఆరు గంటలకే ఫినిష్ చేసుకుని ఇంటికెళ్లి క్లింకారా తోనే టైం గడిపేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చరణ్ – క్లింకారా గురించి నిహారిక తన మాటల్లో చెప్పుకొచ్చింది.

Niharika Kondela about Klinkara Kondela - Ram Charan

చరణన్నని ఇప్పుడే ముప్పు తిప్పలు పెడుతుంది – నిహారిక

నిహారిక (Niharika Konedela) నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తుండగా, ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటూ, రామ్ చరణ్ – క్లింకారా గురించి ప్రస్తావించింది. విలేఖరి క్లింకారా పేరు ప్రస్తావించగానే… నిహారిక మాట్లాడుతూ… క్లీంకార మీద ఇంట్లో అందరి అటెన్షన్ ఉంటుంది. అందరినీ తన వైపే తిప్పేసుకుంటుంది.. క్లీంకార చాలా నాటీ అని చెప్పుకొచ్చింది. అలాగే.. చరణన్నని ముప్పు తిప్పలు పెడుతుందని, తనకి తినిపించేందుకు ఎంతో బతిమిలాడతాడని, ఇంట్లో ఉన్న పెట్స్‌ కుక్క పిల్లల్ని, బర్డ్స్ ని చూపిస్తూ, బొమ్మల్ని చూపిస్తూ మెల్లిగా తినిపిస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే రామ్ చరణ్ ఇప్పుడు ఎలాంటి పని లేనట్టు క్లింకారా నే ప్రపంచంగా ఉన్నాడని, చరణాన్న ది బెస్ట్ ఫాదర్ అని నిహారిక చెప్పుకొచ్చింది.

- Advertisement -

సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీ…

ఇక నిహారిక కొణిదెల విషయానికి వస్తే.. తెలుగుతో పాటు ఒక కోలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే నిర్మాతగా పలు వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తుంది. మంచి కథ, రోల్ దొరికితే ఎక్కడైనా నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ గా అయితే నిహారిక కు ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా లేదన్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే వారం నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు