Niharika Konedela : ఫస్ట్ జాబ్ గురించి చెప్పుకొచ్చిన మెగా డాటర్.. తొలి జీతం ఎంతంటే?

Niharika Konedela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నాళ్ల కింద హీరోయిన్ గా పరిచయమైన నిహారిక, అందులో అంతగా రాణించకపోవడంతో, రీసెంట్ గా నిర్మాతగా మారింది. పింక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పలు చిత్రాలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న నిహారిక, తాజాగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా నిర్మించింది. గత వారం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా “కమిటీ కుర్రోళ్ళు” ను కొత్త డైరెక్టర్ యదు వంశీ డైరెక్ట్ చేయగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. అంతా కొత్త తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి థియేటర్లలో మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది. ఒక విలేజ్ యూత్ డ్రామాగా తెరకెక్కి ప్రేక్షకులని అలరిస్తుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయ్యి మంచి లాభాలని తెస్తుండగా, ఇప్పటికీ కమిటీ కుర్రోళ్లు డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది.

Niharika Konedela talks about her first job

ఫస్ట్ జాబ్ ఎక్స్పీరెన్సు చెప్పిన నిహారిక..

అయితే తాజాగా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలలో నిహారిక కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. నిహారిక మాట్లాడుతూ… నన్ను నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఎటూ పంపించలేదు. దాంతో నేను హైదరాబాద్‌ లోనే చదువుకున్నాను, ఇక్కడే మొదటి జాబ్‌ కూడా చేశాను అని చెపుకొచ్చింది. నాగబాబు వంటి స్టార్ కిడ్‌, మెగాస్టార్‌ చిరంజీవి (Mega Family) వంటి స్టార్ ఫ్యామిలీ అమ్మాయి అయినా బయట ఎక్కడా చెప్పుకునే దాన్ని కాదని అంది. ఉద్యోగ్యం వదిలేసాకే చాలా మందికి తన పర్సనల్ విషయాలను తనతో పని చేసిన వాళ్ళతో పంచుకున్నాని అంది.

- Advertisement -

తొలి జీతం ఇంతేనా?

ఇక నిహారిక తన జాబ్ గురించి చెప్తూ… చదువుకునే రోజుల్లోనే తాను హైదరాబాద్ లో ఒక కేఫ్‌ లో జాబ్‌ చేశానని, అక్కడ తనకు వారానికి వెయ్యి రూపాయల చొప్పున జీతంగా ఇచ్చే వారని, నెలలో జీతం మొత్తంగా అయిదు వేల రూపాయలు వచ్చేదని, అదే తన తొలి జీతం అని నిహారిక చెప్పుకొచ్చింది. అయితే అంత తక్కువ జీతానికి ఉద్యోగం చేయడమెంటనే తన ఫ్రెండ్స్ అనుకునేవారట. కానీ నిహారిక మాత్రం తాను ఏదో ఒక పని చేసి సొంత కాళ్లపై నిలబడాలి అనుకుందట. తనకు జీతం ఎంతో అని తెలుసుకోకుండానే కేఫ్ లో జాయిన్ అయ్యానని నిహారిక చెప్పుకొచ్చింది. ఆ జాబ్ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి వేరే జాబ్స్ చేసానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు 10 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు