NiharikaKonidela: చీరలో మెరిసిన నిహారిక..పెళ్లికి రెడీ అవుతుందా ?

Niharika Konidela: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాకుండా హీరోయిన్గా కొణిదెల నిహారిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క నిహారిక మాత్రమే ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ నిహారికను అభిమానులు పెద్దగా ఆదరించలేకపోయారు. నాగబాబు కుమార్తెల ఢీ డాన్స్ షోతో యాంకర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది నిహారిక.

అక్కడ ఎంతో మందిని మెప్పించిన ఈ బ్యూటీ కొన్ని షార్ట్ ఫిలింలలోను నటించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి అనే పలు వెబ్ సిరీస్ లను నిర్మించడంతో పాటుగా నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకున్న నిహారిక ఓవైపు యాంకర్ గా, నటిగా రాణించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక సినిమాలకు దూరంగా ఉంటుంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ సంస్థను స్థాపించి దానిని నిర్వహిస్తోంది. ఇక నిహారిక జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి వివాహాన్ని నాగబాబు అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక కొద్ది రోజుల పాటు కలిసున్న వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం నిహారిక తన పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటుంది.

- Advertisement -

విడాకుల అనంతరం నిహారిక సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో నిహారిక చీరకట్టులో అందంగా ముస్తాబయింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలామంది నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటోలో వైరల్ గా మారాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు