Niharika : బాబాయ్ ఇన్స్పిరేషన్… గ్రామ పంచాయతీలకు భారీ సాయం

Niharika : రీసెంట్ గా కురిసిన వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లకల్లోమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలవడానికి తామున్నామంటూ కదిలి వస్తున్నారు పలువురు స్టార్ హీరోలు. అందులో భాగంగా ఇప్పటికే అక్కినేని, నందమూరి, దగ్గుబాటి, మెగా కుటుంబాల హీరోలు తమ వంతుగా భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా డాటర్ నిహారిక 10 గ్రామాలకు విరాళాన్ని ప్రకటించింది. బాబాయ్ ఇన్స్పిరేషన్ తోనే ఇచ్చినప్పటికీ ఆమెను చూసి స్టార్ హీరో హీరోయిన్లు సిగ్గుపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఉడతా భక్తిగా నిహారిక విరాళం

మెగా డాటర్ నిహారిక తాజాగా తన వంతు సాయంగా వరద వంపుకు గురైన 10 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 50,000 చొప్పున మొత్తంగా 5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను కూడా షేర్ చేసింది. అందులో బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు ఇబ్బందులు పడుతుండడం అనేది నాకు చాలా బాధను కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రజలే. నేను పుట్టి పెరిగిందంతా నగరంలోనే అయినప్పటికీ మా పెద్దలు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. కాబట్టి నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతగానో అభిమానం ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి అయిన మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం సంతోషాన్ని కలిగించింది. నేను కూడా ఈ బృహత్కార్యం లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక 10 గ్రామాలకు 50,000 విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ ను రిలీజ్ చేసింది. అయితే ఆమె సాయంపై కొందరు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు స్టార్ హీరోయిన్ల కంటే నీహారిక బెటర్ అంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరు, చరణ్, అల్లు అర్జున్, పవన్ భారీగా విరాళాలు ప్రకటించారు.

Pic Talk - Niharika Konidela Hot Cleavage Show

- Advertisement -

హీరోయిన్లు చూసి నేర్చుకోండి

మెగా డాటర్ అయినప్పటికీ ఆమె చేసిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. హీరోయిన్ గా నిలదొక్కుకోకపోయినా తన బాబాయ్ ఇన్స్పిరేషన్ తో ఈ బ్యూటీ 5 లక్షలు విరాళంగా ప్రకటించి అందరి మన్ననలు పొందుతోంది. ఇక ఎక్కడి నుంచో టాలీవుడ్ కి వచ్చి కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునే స్టార్ హీరోయిన్లు ఒక్కరు కూడా కనీసం ఇప్పటిదాకా స్పందించకపోవడం సిగ్గుచేటు. కోట్లాది రూపాయలు అందుకోవడానికి, ఇక్కడ సినిమాలు చేయడానికి అయితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పరిగెత్తుకొస్తారు. కానీ ఇలా సాయం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్క హీరోయిన్ కూడా కనీసం నోరు విప్పదు అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు