Niharika Konidela: కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ జోష్ లో మరో ప్రాజెక్ట్ రెడీ

Niharika Konidela: ప్రస్తుతం వచ్చిన సినిమాల్లో కొంతమేరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమాతో చాలామంది యూట్యూబర్స్ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడుగా మారాడు. యాదు వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ను చూపించారు. ఈ సినిమాలో కొంతమంది కుర్రోళ్ళు తమ బాల్య జీవితాన్ని ఎలా గడిపారు అని అనేక అంశాలను చూపించి మంచి నోస్ట్రాలజీ ఫీల్ క్రియేట్ చేశారు. ఈ సినిమా 90 కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక విలేజ్ లో అందరూ బాగా కలిసి ఉండి బాగా మాట్లాడుకునే స్నేహితులు ఒక చిన్న గొడవ వలన ఎలా విడిపోయారు. మళ్లీ వారంతా ఎలా కలిశారు.? ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఏంటి అని చూపించాడు దర్శకుడు.

Committee Kurrollu

- Advertisement -

ఈ సినిమాతో నిహారిక(Niharika) కూడా నిర్మాతగా సక్సెస్ అయింది అని చెప్పాలి. ముందుగా యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నిహారిక చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ తర్వాత ప్రొడక్షన్స్ లో అడుగు పెట్టింది. ఇప్పుడు మొదటి సినిమా హిట్ అందుకోగానే రెండవ ప్రాజెక్టును సిద్ధం చేసింది.నిహారిక ప్రస్తుతం బెంచ్ లైఫ్(Bench Life) అనే మరో సిరీస్ ను సిద్ధం చేసింది. ఈ సినిమా సోనీ లివ్ లో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఒక ఐదుగురు ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ లైఫ్ ను చూపిస్తుంది. పాపులర్ తెలుగు యాక్టర్ వైభవ్ ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు. ఒక 10 ఏళ్లు క్రితం నయనతార నటించిన అనామిక సినిమాలో చివరిసారి కనిపించాడు వైభవ్. ఇక ఇప్పుడు ఈ సిరీష్ వైభవ్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడండి. ఈ సిరీస్ లో రితిక సింగ్, ఆకాంక్ష సింగ్, రాజేంద్రప్రసాద్, వెంకటేష్ కాకుమానం లాంటి ప్రముఖ నటులు కనిపించనున్నారు ఈ సిరీస్ కు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు