Niharika: మా నాన్న ఒక సుత్తి.. నాగబాబు పోస్ట్ లపై నిహారిక షాకింగ్ కామెంట్స్..!

Niharika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది నిహారిక. అయితే హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలనుకుంది కానీ ఈమెకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ సంస్థలో పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే నిహారిక తమ కుటుంబ విషయాలను కూడా పంచుకుంది. ఇక అంతేకాదు తన నాన్న గురించి ఒక షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ముద్దుగుమ్మ.

Niharika: My father is a hammer.. Niharika's shocking comments on Nagababu's posts..!
Niharika: My father is a hammer.. Niharika’s shocking comments on Nagababu’s posts..!

మా నాన్న ఒక సుత్తి..

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు గతంలో చేసే షోలకు గెస్ట్ గా వెళ్లి అల్లరి చేస్తూ ఉండేది నిహారిక. అయితే ఈ మధ్యకాలంలో తన తండ్రి గురించి పలు రకాల సిల్లీ కామెంట్లు చేస్తూ అందరిని ఆశ్చర్యపరచుతోంది. ఒకప్పుడు తన నాన్న శాడిస్ట్ అంటూ సరదాగా కామెంట్ చేసిన ఈమె ఇప్పుడు ఏకంగా తన నాన్న సుత్తి అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఏ సందర్భంలో ఆమె ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చింది.

ఎక్స్ పోస్టులు, వాట్సాప్ మెసేజ్లు సుత్తిలా అనిపిస్తాయి..

గతంలో నాగబాబు హర్ట్ అయ్యి ఆ పోస్ట్ చేశారు అంటూ ఎలక్షన్ టైం లో వార్తలు వచ్చాయి కదా.. మా నాన్న ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటారు. ఆయన వేరే దేని గురించో పోస్ట్ పెట్టి ఉంటారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు.. నాన్న ఎక్స్ లోనే కాదు వాట్సాప్ లో కూడా ప్రతిరోజు ఏదో ఒక సూక్తి పెడుతూ ఉంటారు. అది మాకు పెద్ద సుత్తిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వాట్సప్ అయినా ఎక్స్ అయినా ఆయన పెట్టే పోస్టులు మెసేజ్లు మాకు సుత్తిగానే అనిపిస్తాయి అంటూ సరదాగా చెప్పుకొచ్చింది నిహారిక .మొత్తానికైతే తన తండ్రి పై ఇలాంటి కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

కమిటీ కుర్రోళ్ళు సినిమా విశేషాలు..

ఇక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైన తర్వాత నిర్మాతగా నేను మరో సినిమా గురించి ఆలోచిస్తాను. డ్రామా , రొమాంటిక్, కామెడీ, మైథాలజికల్ స్టోరీ అంటే ఇష్టం. నటిగా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాను. కొత్త నటీనటులతో దర్శకుడు ఎదు వంశీ తెరకేక్కించిన చిత్రమే కమిటీ కుర్రోళ్ళు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుందని సినిమాను మీరంతా ఆదరిస్తారని భావిస్తున్నాను అంటూ సినిమా గురించి అలాగే తన తండ్రి గురించి కామెంట్లు చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు