Niharika: ఆ విషయంలో తండ్రినే మించిపోయిన నిహారిక.. గ్రేట్ కదా.?

Niharika.. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ప్రూవ్ చేసుకుంది అని చెప్పవచ్చు. హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలనుకున్న ఈమె ఎదగలేకపోయింది దాంతో నిర్మాత కావాలనుకుంది..అయితే నిహారికను వెనక్కి నెట్టాలని చూసింది మెగా ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీయే ఇప్పుడు మెచ్చుకోవాల్సిందే. తాజాగా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఒక్క సినిమాతో మెగా ఫ్యామిలీలో రెబల్ అనిపించుకుంది నిహారిక.

Niharika: Niharika surpasses her father in that regard.. great?
Niharika: Niharika surpasses her father in that regard.. great?

వెనక్కి లాగే ప్రయత్నం..

ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఎంతోమంది ఈమెను అడ్డుకోవాలని చూశారు. అయినా సరే హీరోయిన్ కావాలన్న తన కోరికను నెరవేర్చుకుంది. పరిశ్రమకు రావాలన్న నిహారిక నిర్ణయం పై వ్యతిరేకత వ్యక్తం అయినా అన్నింటిని అధిగమించి నేడు సక్సెస్ అవ్వడం మెగా ఫ్యామిలీ మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పవచ్చు.

మెగా ఫ్యామిలీ మెచ్చుకోవాల్సిందే..

ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి హీరోయిన్ గా పరిచయమైంది. నాగశౌర్య హీరోగా నటించిన ట్రాజెడీ లవ్ డ్రామా పర్వాలేదు అనిపించుకుంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి లో కూడా కీలకపాత్ర పోషించింది. అయినా సరే నటిగా ఈమెకు బ్రేక్ రాలేదు. దాంతో వివాహం చేసుకుంది. అయినా సరే ఇండస్ట్రీ మీద మనసు పోలేదు. అనవసరంగా భర్తతో విడిపోయి విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఒకవైపు నటిగా నటిస్తూనే, మరొకవైపు నిర్మాతగా రాణించాలనుకుంది. అందులో భాగంగానే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నూతన దర్శకులు , నటులు, రచయితలతో సంప్రదింపులు జరిపి, తొలి ప్రయత్నంగా కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసింది. ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పుడే రూ.8.49 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ దాటేసింది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ రూ .5కోట్ల లోపే, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఇంకొంత సంపాదించి నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక.

- Advertisement -

తండ్రి పైనే సక్సెస్ సాధించిన నిహారిక..

ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర వార్త తెర పైకి రావడం అందరిని ఆలోచింపజేసింది. ఎందుకంటే ఈమె తండ్రి నాగబాబు నిర్మాతగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. నాగబాబు నిర్మాతగా ఒక విజయం కూడా చూడలేదు. నాగబాబు తన బ్యానర్ లో.. చిరంజీవి హీరోగా రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు , బావగారు బాగున్నారా వంటి చిత్రాలు నిర్మించాడు. ఒక్కటి కూడా నాగబాబుకు బ్రేక్ ఇవ్వలేదు. అన్నీ కూడా డిజాస్టర్ గానే మిగిలాయి. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ డబుల్ డిజాస్టర్.. ఈ సినిమా దెబ్బకు రోడ్డున పడ్డారు నాగబాబు. ఆ తర్వాత జబర్దస్త్ జడ్జిగా మారారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా సినీ రంగంలో మాత్రం ఈయన సక్సెస్ చూడలేదు. కానీ ఈయన కూతురు నిహారిక మాత్రం ఊహించని సక్సెస్ అందుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంది . తండ్రి నిర్మాతగా ఫెయిల్ అయినా నిహారిక మాత్రం సక్సెస్ సాధించి, సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు