Niharika: కమెడియన్ తో రొమాన్స్ కి సిద్ధమైన నిహారిక.. సక్సెస్ అవుతుందా.?

Niharika.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న నిహారిక ఎన్.ఎమ్.అడివి శేషు మేజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబుతో సందడి చేసిన విషయం తెలిసిందే.. అలాగే ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ తో కూడా ఈమె ఫస్ట్ డేట్ అంటూ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ కూడా బాగా పాపులారిటీ దక్కించుకుంది. అలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది..

Niharika: Niharika who is ready for a romance with a comedian.. Will it be successful?
Niharika: Niharika who is ready for a romance with a comedian.. Will it be successful?

వరుస సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకుంటున్న ప్రియదర్శి..

ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన చాలామంది తొలుత కమెడియన్ లుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై, ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయిన కమెడియన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి పులికొండ కూడా ఒకరు. తొలుత మల్లేశం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి, ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో తోటి హీరోగా నటించి మెప్పించారు. ఇక బలగం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జబర్దస్త్ కమెడియన్ వేణు కూడా డైరెక్టర్గా మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రియదర్శి సినిమాలే కాదు సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.ఇటీవల డార్లింగ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించిన ఈయన ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

ప్రియదర్శితో రొమాన్స్ కి సిద్ధమైన నిహారిక..

ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమా కోసం ఒక ఫేమస్ కంటెంట్ క్రియేటర్ ని హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది .ఆమె ఎవరో కాదు నిహారిక ఎన్.ఎమ్. తమిళనాడుకు చెందిన ఈమె అమెరికాలో చదువు పూర్తి చేసింది. అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేజర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, కేజీఎఫ్ రిలీజ్ టైం లో యష్ సహా పలువురు పెద్ద పెద్ద హీరోలతో కలిసి ఆ సినిమాలను ప్రమోట్ చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ వారు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ కూడా విడుదల చేశారు. అప్పుడే ఈమె ఏదో సినిమా చేస్తోందని అంచనాలు అందరిలో నెలకొన్నాయి.. కానీ ఇప్పుడు ఆ సినిమాపై క్లారిటీ వచ్చేసింది.. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంపికైనట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడునుంది.

- Advertisement -

సక్సెస్ అవుతుందా..

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న నిహారిక, తన అద్భుతమైన నటనతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది. తొలిసారి హీరోయిన్ గా అడుగు పెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ, హీరోయిన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు