Niharika: అక్కడ సర్జరీ చేయించుకున్న నిహారిక.. ఫొటోస్ వైరల్..!

Niharika..తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ వుండి కూడా సక్సెస్ కాలేకపోయిన వారిలో నిహారిక కొణిదెల మొదటి స్థానంలో ఉంటుంది.. మెగా అనే బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా అటు హీరోయిన్గా ఇటు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించలేకపోయింది నిహారిక. అంతేకాకుండా జొన్నలగడ్డ చైతన్యతో వివాహమైనప్పటికీ కూడా కొన్ని కారణాల చేత విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా ఏ ఒక్కటి కూడా నిహారికకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. తాజాగా నిహారిక తన బాడీలో ఒక పార్ట్ కు సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వాటి గురించి చూద్దాం.

Niharika: Niharika who underwent surgery there.. Photos viral..!
Niharika: Niharika who underwent surgery there.. Photos viral..!

సర్జరీ చేయించుకున్న నిహారిక..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నిహారిక. నిర్మాతగా పలు సినిమాలను చేస్తూ తన లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది నిహారిక. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ ను చేస్తూనే.. మరొకవైపు ఫోటోషూట్లతో కూడా అందరిని ఆకట్టుకునే పనిలో ఉంటుంది.. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక వైట్ షర్టులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో నిహారిక మాత్రం చాలా సింపుల్ గానే షర్టు మడతపెట్టి కనిపిస్తున్నట్టుగా ఉన్నది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్యూట్ మెగా డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫోటోలు వైరల్..

మరి కొంతమంది నిహారిక పెదవికి సర్జరీ చేయించుకున్నది అంటూ పలు రకాలుగా కామెంట్లను చేస్తుండగా .. మరికొంతమంది నిహారికని సైతం డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. మరి ఈ విషయం పైన నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.. ప్రస్తుతం నిహారిక అయితే కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆగస్టులో విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

మళ్లీ పెళ్లికి సిద్ధం…

నిహారికకు పిల్లలంటే చాలా ఇష్టమని కాబట్టి పిల్లల కోసమైనా తను కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకుంటానంటూ గతంలో కూడా తెలియజేసింది. అయితే అది ఎప్పుడు ఎవరితో జరుగుతుంది అనే విషయం మాత్రం తనకు తెలియదంటూ కూడా తెలియజేసింది.. ప్రస్తుతానికైతే తాను సింగిల్ గానే ఉన్నానని.. రాబోయే రోజుల్లో ఏదో ఒక టైములో కచ్చితంగా ప్రేమలో పడే అవకాశం ఉందంటూ తెలియజేసింది నిహారిక. అలాగే తన జీవితంలో ఎదురైన ప్రతి ఎదురు దెబ్బని కూడా గుణపాఠంగా తీసుకుంటానని కూడా తెలిపింది నిహారిక…

ఫ్రెండ్స్ తో వెకేషన్స్..

నిహారిక ప్రస్తుతం అటు వైవాహిక జీవితానికి దూరమై ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ బాధల నుండి బయటపడడానికి.. తన ఫ్రెండ్స్ తో లొకేషన్స్ కి వెళ్తూ టైం గడిపే ప్రయత్నాలు చేస్తోంది..ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ.. అభిమానులతో ముచ్చటిస్తూ ఎప్పుడూ చేరువలోనే ఉంటుందని చెప్పవచ్చు.. ఇక ఇప్పుడు సర్జరీ చేయించుకుంది అన్న వార్తలు రాగా.. దీనిపై ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు