Niharika: నిహారిక పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది… ఏదీ కలిసి రావడం లేదు

Niharika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క ఈ కుటుంబం నుంచి దాదాపు 10 మందికిపైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో నలుగురు స్టార్ హీరోలుగా.. పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక నటి నిహారిక మాత్రమే.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలుదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఈమెకు కలిసి రాలేదు.

యాంకర్ గా తొలి ప్రయత్నం..

Niharika: Nothing coming together for Niharika..?
Niharika: Nothing coming together for Niharika..?

నటనపై ఆసక్తితోనే చదువు పూర్తయిన వెంటనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు టీవీ షోలో , యాంకర్ గా కూడా నటించి మెప్పించింది. అయితే ఈ టీవీ షోలో యాంకర్ గా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు .దాంతో మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను ఉపయోగించుకొని హీరోయిన్ గా చలామణి అవ్వాలనుకుంది. అలా ఒక మనసు, సూర్యకాంతం వంటి సినిమాలు చేసింది. కానీ ఇవి కూడా ఈమెకు పెద్దగా వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి.

వివాహం కూడా కలిసిరాలేదు..

తర్వాత పెద్దలు కుదిరిచిన వివాహంగా చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. వివాహం జరిగిన ఏడాదికే విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.. అలా కెరియర్ లో సక్సెస్ కాకపోవడంతో వ్యక్తిగతంగా అయినా నిలదొక్కుకుంటుందని అందరూ అనుకున్నారు అయితే అలా అతడితో కొనసాగలేక విడాకులు ఇచ్చి ఇంటి బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ.. విడాకుల తర్వాత వెకేషన్స్ అంటూ ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేసిన నిహారిక..

- Advertisement -

నిర్మాతగా కూడా..

ఇప్పుడు ది పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా సొంతంగా సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది అలాగే అందులో నటిస్తోంది కూడా.. అయితే నిర్మాతగా కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలి అంటే ఏదో ఒక రంగంలో ఈమె నిలదొక్కుకోవాల్సి ఉంది. కానీ ఏ రంగం కూడా ఈమెకు పెద్దగా కలిసి రాకపోవడం.. అందరిలో పలు ఆశ్చర్యాలకు, అనుమానాలకు దారి తీస్తోందని చెప్పాలి..

ఇప్పుడు కూడా కలసి రాలేదు..

కనీసం ఇప్పటికైనా మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నిహారిక కు కలిసి వస్తుందా లేక ఎప్పటిలాగే ఎటు తేలకుండా ఈమె జీవితం అయిపోతుందని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరి నిహారిక తన నటనతో తనను తాను ప్రూవ్ చేసుకొని హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా కనీసం ప్రొడక్షన్ రంగంలో అయినా సరే లేడీ నిర్మాతగా పేరు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు నిహారిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి అయితే నిహారికకు ఎప్పుడు కలసి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు