Niharika: మాజీ భర్తకు కోసం నిహారిక స్పెషల్ పోస్ట్ ?

Niharika :టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని… చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో కొంతమంది రాణిస్తూ ఉంటే… మరి కొంతమంది హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కేవలం నిహారిక కావడం విశేషం.

నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు కూతురుగా… అలాగే చాలా సినిమాలు చేసిన నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు నిహారికది. అయితే అలాంటి నిహారిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసింది. అందులో కొంతమేర సక్సెస్ అందుకుంటే… ఫెయిల్యూర్ కూడా ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఈ బ్యూటీ. తన భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత నిర్మాతగా కూడా అవతారం ఎత్తింది నిహారిక.

ఇది ఇలా ఉండగా నిహారిక గురించి సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త వైరల్ గా మారింది. తాజాగా… సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరి గురించి మెన్షన్ చేస్తూ…. ఈ పోస్టు పెట్టిందట నిహారిక. నెటిజెన్స్ చాలా భిన్నంగా స్పందించారట.

- Advertisement -
Mega daughter's special invitation to ex-husband
Mega daughter’s special invitation to ex-husband

తన మాజీ భర్తకు కూడా స్పెషల్ పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేశారట. అంతే కాదు వీరిద్దరు మళ్ళీ కలుస్తారా అన్నట్లుగా కూడా కామెంట్ చేశారట నెటిజన్స్. దీంట్లో వెంటనే ఆ సోషల్ మీడియా పోస్టు కూడా డిలీట్ చేసిందట నిహారిక. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు… నిహారిక అంటే పడని వారు మాత్రం దీనిని బాగా వైరల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు