SPY: ఇండియాస్ బిగ్గెస్ట్ సీక్రెట్ ని ఛేదిస్తున్న నిఖిల్..!

యంగ్ హీరో నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీ డైరెక్షన్లో రూపొందిన సినిమా స్పై. చాలా కాలం కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల డిలే అవుతూ, ఎట్టకేలకు పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 29న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇండియాస్ బిగ్గెస్ట్ సీక్రెట్ ని ఛేదించే స్పై టీమ్ చుట్టూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్లో అనవసరపు పాయింట్స్ ఏవీ హైలైట్ చేయకుండా స్ట్రయిట్ గా కథని రివీల్ చేసి ఆడియెన్స్ ని ప్రిపేర్ చేసాడు డైరెక్టర్. గ్రిప్పింగ్ సీన్స్ తో ఆకట్టుకున్న ట్రైలర్ కి బీజీఎమ్ కూడా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

చివర్లో రానా కనిపించటం ట్రైలర్ కే హైలైట్ అయ్యింది. మొత్తానికి ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ కి మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందన్న నమ్మకం కలుగుతుంది. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ క్యారెక్టర్ తో పాటు అభినవ్ గోమతం, మకరంద్ దేశ్ పాండే పాత్రలు కూడా సినిమాలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ ఒక ఇంపార్టెంట్ రోల్ కనిపించనున్నాడు.

కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు యూనివర్సల్ రీచ్ ఉన్న కథతో స్పై సినిమా ద్వారా వస్తున్న నిఖిల్ కి మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ అన్న సంకేతం ఇస్తోంది ఈ ట్రైలర్. రిలీజ్ కి పదిరోజుల గ్యాప్ కూడా లేని సమయంలో హడావిడిగా రిలీజ్ కన్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు