Nithin : రాబిన్ హుడ్ నుండి క్రేజీ అప్డేట్..

Nithin : టాలీవుడ్ స్టార్ నితిన్ ఎక్కడా తగ్గడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లతో మీడియం రేంజ్ హీరోల్లో మంచి మార్కెట్ కలిగిన నితిన్, ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. దీనికి కారణం మూసధోరణిలో సినిమాలు చేయడమే అని చెప్పొచ్చు. ఇది తెలుసుకున్న నితిన్ కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలని ఒకేసారి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ ఇయర్ లో మాత్రం రాబిన్ హుడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ముందు ఆ సినిమాపై బాగా ఫోకస్ పెట్టాడు నితిన్. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆ సినిమా 70 శాతానికి పైగా పూర్తవగా, మిగతా పార్ట్ ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

Nithin Robinhood Movie latest update

రాబిన్ హుడ్ లో నితిన్ అదిరిపోయే స్టెప్పులు..

ఇక నితిన్ రాబిన్ గుడ్ సినిమా నుండి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన మేకర్స్, తాజాగా అక్కడే నితిన్ పై నైట్ టైమ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు సమాచారం. చాలా రోజులుగా నితిన్ నుండి పాటల పరంగా కూడా సరైన సాంగ్ రావడం లేదు. అప్పుడెప్పుడో భీష్మ లో కొంచెం బెటర్ సాంగ్ రాగా, తాజాగా రాబిన్ హుడ్ లో నితిన్ కి కెరీర్ బెస్ట్ స్టెప్ప్పులు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడట. అయితే ఈ సాంగ్ లో నితిన్ మాత్రమే డాన్స్ ఉంటుంది. హీరోయిన్ శ్రీలీల కి తో కూడా ఉంటుందా అనేది క్లారిటీ లేదు.

- Advertisement -

క్క్రిస్మస్ స్పెషల్ గా రాబిన్ హుడ్..

ఇక నితిన్ (Nithin) నటిస్తున్న రాబిన్ హుడ్ లో యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు