Nitya Menon: ఈ జోనర్ సినిమాలకు అసలు నేషనల్ అవార్డు వస్తుంది అనుకోలేదు, నేషనల్ అవార్డుపై నిత్యామీనన్ స్పందన

Nitya Menon: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు నిత్యామీనన్. తెలుగు ప్రేక్షకులు కూడా నిత్యమీనన్ బాగానే పరిచయమని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్టీఆర్(NTR) అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది నిత్య. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ భామకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ గా కూడా నిత్యామీనన్ కు మంచి పేరు ఉంది.

తెలుగు సినిమాలలో నిత్య మీనన్(Nitya Menon) ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా పవర్ఫుల్ రోల్ లో కనిపించింది.
ఒక తెలుగులో నిత్య చేసిన సినిమాలు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ అయ్యాయి. నానితో చేసిన అలా మొదలైంది, నితిన్(NITHIN) సరసన కనిపించిన ఇష్క్(Ishq) వంటి సినిమాలు విపరీతమైన పేరును తీసుకొచ్చాయి. రీసెంట్గా మెయిన్ లీడ్ గా కూడా సినిమాలు చేయటం మొదలు పెట్టింది నిత్యామీనన్.

Nithya Menon

- Advertisement -

రీసెంట్గా ధనుష్(Dhanush) తో పాటు నిత్యమీనన్(Nitya Menon) తిరు అనే సినిమాలు నటించింది. ఈ సినిమాకి రీసెంట్ గా నేషనల్ అవార్డు దక్కింది. దీనిపై నిత్యమీనన్ స్పందిస్తూ అసలు ఈ జోనర్ లో సినిమాలకు నేషనల్ అవార్డు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటూ స్పందించింది. అలానే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తనకు తను ఫస్ట్ కాల్ చేసి తన బెస్ట్ విషెస్ చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలో నిత్యమీనన్ కనిపించిన పాత్ర అందరిని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. తమ నిజ జీవితంలో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో అని చాలామంది అబ్బాయిలు ఆ సినిమా చూసిన తర్వాత ఫీలయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు