Nivetha Pethuraj : యంగ్ హీరో పై నివేత పేతురాజ్ షాకింగ్ కామెంట్స్..!

Nivetha Pethuraj : ప్రముఖ యంగ్ హీరోయిన్ నివేత పేతురాజు మెంటల్ మదిలో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది . నటన పరంగా.. అందం పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకొని మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ బిజీగా గడిపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ అమ్మడు. ఇందులో పరేశ్ అగస్త్య, నివేత కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ని సిద్ధార్థ్ నాయుడు, వడ్డపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. Zee – 5 వేదికగా జూన్ 14వ తేదీన స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్ తో ఈ సిరీస్ దూసుకుపోతున్న నేపథ్యంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇకపై యంగ్ హీరో విశ్వక్ సేన్ తో సినిమాలు చెయ్యను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

విశ్వక్ తో సినిమాలు చేయను..

Nivetha Pethuraj: Nivetha Pethuraj shocking comments on young hero..!
Nivetha Pethuraj: Nivetha Pethuraj shocking comments on young hero..!

అయితే ఇంత సడన్ గా ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఇలా కామెంట్లు చేసింది? అసలు ఏమైంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకెళితే వీరిద్దరి కాంబినేషన్లో పాగల్, మాస్ కా ధమ్కీ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు చేస్తున్నప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఎవరో కొంతమంది దుష్ప్రచారాలు సృష్టించారు. ఈ క్రమంలోనే ఈ విషయాలపై తాజాగా పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ విషయంపై ప్రశ్న ఎదురయింది.. విశ్వక్ తో మీరు ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి కదా.. అని యాంకర్ అడగగా.. దీనికి నివేతా మాట్లాడుతూ.. నేను విశ్వక్ తో చేసినవి రెండు సినిమాలే.. ఇక విశ్వక్ తో సినిమా చెయ్యను అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే వీరిద్దరూ భూ అనే సినిమాలో నటించినప్పటికీ అందులో వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు లేవు. అందుకే ఈమె తనతో నటించింది రెండు సినిమాలు అంటూ క్లారిటీ ఇచ్చింది.. నీకు అదే సమయంలో రూమర్స్ బాగా వైరల్ అవ్వడంతో. సినిమా చెయ్యను అని క్లారిటీగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

విశ్వక్ సేన్ కెరియర్..

ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు.. హీరో గానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు విశ్వక్ సేన్ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పేరుతో పాటు అంతకుమించి సక్సెస్ కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు.. ఇదిలా ఉండగా ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన…రీసెంట్ గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించారు.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విశ్వక్ సేన్.. మరి విశ్వక్సేన్ ఈసారి ఏ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. మరోవైపు ప్రస్తుతం యంగ్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరవుతూ ఆ సినిమా సక్సెస్ లకు తన వంతు సహాయం కూడా చేస్తున్నారు. అలాగే బాలయ్య ఫ్రెండ్ గా కూడా నిరూపించుకున్నారు ఏదేమైనా విశ్వక్ కి ఈమధ్య బాగా కలిసి వస్తోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు