Nivetha Pethuraj: అడ్డంగా దొరికిపోయిన నివేదా.. పోలీసులు చుట్టుముట్టడంతో.. వీడియో వైరల్..!

Nivetha Pethuraj.. ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజు తెలుగు, తమిళ్ భాషలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె చివరిసారిగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమాలో కనపడి అలరించి మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు బ్యాడ్మింటన్ గేమ్ లో కూడా అదరగొడుతూ కప్పులు గెలుచుకుంటోంది. ఇదిలా వుండగా తాజాగా పోలీసులు అడ్డగించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. అసలు ఈ వీడియోలో ఏముంది? ఆమెను ఎందుకు పోలీసులు అడ్డగించారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

పోలీసులకు చిక్కిపోయిన నివేదా పేతురాజ్..

Nivetha Pethuraj: Nivetha who was found stranded.
Nivetha Pethuraj: Nivetha who was found stranded.

ఈ వీడియోలో నివేదా పేతురాజ్ కార్ లో వెళ్తుంటే పోలీసులు చెకింగ్ కోసం ఆపారు.. వెనుక డిక్కీ ఓపెన్ చేయమని ఆమెను అడగ్గా.. చెయ్యను..? ఎందుకు..? కావాలంటే పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి చూసుకోండి అంటూ పోలీసులతో గొడవ దిగింది.. ఇదంతా రికార్డ్ చేస్తుంటే ఎందుకు రికార్డు చేస్తున్నారు అంటూ కెమెరాని కూడా తన చేత్తో మూసేసింది.. దీంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే నిజంగానే నివేదా పేతురాజు తన డిక్కీలో ఏం తీసుకెళ్తుంది.. పోలీసులకు చెకింగ్ కోసం సహకరించడానికి ఎందుకు భయపడుతోంది? అంటూ పలువురు కామెంట్లు చేస్తుంటే… ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ లాగా చేసినట్లు ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పోలీస్, నివేద ఎక్స్ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్టే వున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి నిజంగానే పోలీసులు ఆపారా..? లేక ఇదంతా ఒక ప్రమోషన్ స్టంటా తెలియాలి అంటే ఇక అసలు నిజం తెలిసే వరకు వేచి చూడాలి. మొత్తానికి అయితే ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నివేదా పేతురాజ్ సినిమాలు..

దక్షిణ భారతదేశ సినీ నటిగా పేరు తెచ్చుకున్న ఈమె ఒక మోడల్.. తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది.. 2016 లో వచ్చిన ఒరు నాల్ కూత్తు అనే తమిళ చిత్రంతో ఈమె నటన రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మెంటల్ మదిలో అనే చిత్రంతో అరంగేట్రం చేసిన ఈమె.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు దుబాయ్లో తల్లిదండ్రులతో పాటు 20 సంవత్సరాల అక్కడే ఉండి, 2015లో మిస్ ఇండియా యూఏఈ పోటీలో కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక 2016లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఆ తర్వాత స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన టిక్ టిక్ టిక్ చిత్రానికి గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.. ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అలవైకుంటపురంలో, బ్లడీ మేరీ, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. అలాగే తమిళ్లో పలు చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. మరి ఇప్పుడు పోలీసులకు దొరికిపోయినట్టు ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇక అసలు విషయం తెలియాలి అంటే నిజం బయటకు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు