Nivetha Thomas: “అతడే నా భర్త “.. హాట్ బాంబ్ పేల్చిన నాని బ్యూటీ..!

Nivetha Thomas.. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నివేదా థామస్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈమె ఆ తర్వాత మళ్లీ నానితో నిన్ను కోరి వంటి లవ్ స్టోరీ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అందంతో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా థామస్ గ్లామర్ పాత్రలకు మాత్రం ఎప్పుడూ దూరం అనే చెప్పాలి.

Nivetha Thomas: "He is my husband"..Nani beauty comments viral..!
Nivetha Thomas: “He is my husband”..Nani beauty comments viral..!

“35 చిన్న కథ కాదు’ మూవీ తో..

అయినా సరే ఈమె నటనకు మంత్ర ముగ్ధులైన దర్శక నిర్మాతలు జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్, 118, షాకిని డాకినీ వంటి సినిమాలు వెబ్ సిరీస్ లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే “35 చిన్న కథ కాదు”.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. నివేదా తన భర్తను పరిచయం చేసి ఆసక్తికర కామెంట్లు చేసింది.

భర్తను పరిచయం చేసిన నివేదా..

ప్రమోషన్స్ లో భాగంగా నివేదా థామస్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రపంచంలో భాగంగా నేను సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేశాను.. దాన్ని చూసి చాలా మంది నాకు పెళ్లి కాబోతోందని భావించారు.. అయితే దానిపై వార్తలు రావడంతో మా అమ్మ నాకు ఆ ఫోటో పంపింది.. అయితే నేను దానిని చూసి.. అవునా అమ్మ .. మీరు ఎప్పుడు నాకోసం అబ్బాయిని చూశారు.. అని అడిగాను. అని తెలిపింది.. అంతేకాదు ఆ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. అవును నాకు పెళ్లయింది.. ఈయనే నా భర్త.. వీళ్ళే నా ఇద్దరు పిల్లలు.. వారే అరుణ్, వరుణ్ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి తల్లిగా నటించడం ఒక సవాలుగా అనిపించింది అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అమ్మ అని పిలుస్తుంటే కొత్తగా వుంది..

35 చిన్న కథ కాదు సినిమా గురించి చెబుతూ.. బాల నటులు నన్ను మేడం అనో లేక అక్క అనో పిలిచేవారు.. ఇప్పుడు అలా కాకుండా అమ్మ అని పిలవడం చాలా ఆనందంగా, కొత్తగా అనిపించింది.. అలాగే తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో డైరెక్టర్ నందకిషోర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు.. హీరో రానా ఈ సినిమాకు సమర్పకుడిగా పనిచేస్తున్నారు.. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ తెలిపింది నివేదా .. ఇక మొత్తానికైతే భర్త , పిల్లలు విషయంపై నివేదా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు