Nivetha Thomas : బరువులో అనుష్కతో పోలిక… జర్నలిస్టుకు ఇచ్చి పడేసిన హీరోయిన్

Nivetha Thomas : హీరోయిన్లు అంటే సన్నజాజి తీగలా అందంగా ఉండాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు కఠినమైన డైట్ ను ఫాలో అవుతూ, ఎక్కువ సమయం వ్యాయామం చేస్తూ ఫిజిక్ ను కాపాడుకుంటారు. అలాగే అభిమానులు కూడా సైజ్ జీరో హీరోయిన్ల అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నటీనటులంటే బరువు కాదు యాక్టింగ్ అంటారు. అయితే ఫ్యాన్స్ ఇలాంటి స్టేట్మెంట్ ను అస్సలు ఒప్పుకోరు. తాము అభిమానించే హీరోయిన్లు ఏమాత్రం బరువు పెరిగినా ట్రోలింగ్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కూడా ఇలాగే తన బరువు గురించి మాట్లాడిన జర్నలిస్ట్ కు తాజాగా ఇచ్చిపడేసింది.

బరువులో అనుష్కతో పోలిక..

రెండేళ్ల తరువాత నివేదా థామస్ చేస్తున్న మూవీ 35-చిన్న కథ కాదు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో తాజాగా నివేదా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఆమె బరువు పెరిగి అందరిని ఆశ్చర్యపరిచింది.. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా జర్నలిస్ట్ ఉదాహరణకు అనుష్క బరువును ప్రస్తావిస్తూ బరువు పెరిగితే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అని ఇన్ డైరెక్ట్ గా నివేదా బరువు గురించి ప్రస్తావించింది. కానీ నివేదా ఆ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి నాదాకా మాత్రం రావు కేవలం మీదాకే వస్తాయి అని చెప్పుకొచ్చింది.

35' (చిన్న కథ కాదు) మూవీ టీజర్‌ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) 35 Chinna Katha Kaadu  Teaser Launch Event Photos | Sakshi

- Advertisement -

అయితే లేదు లేదు మీరు చూసి ఉండరు అనే లోపే 35 అనేది నా బరువు గురించి లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ల బరువు గురించి, ఈ సినిమాలో పని చేసిన వారితో పాటు స్టేజిపై ఉన్న ఎవరి బరువు గురించి కాదు అంటూ ఇచ్చి పడేసింది. దీంతో సదరు జర్నలిస్ట్ మళ్ళీ నోరు లేపకుండా సమాధానం ఇచ్చింది. అంటే ఇన్ డైరెక్ట్ గా తన బరువు అన్నది ఇక్కడ మేటర్ కాదని, సినిమా గురించి మాట్లాడితే చాలని చెప్పిందన్నమాట. అయితే నిజంగానే నివేదా అనుష్క లాగే బాగా బరువు పెరిగిపోయింది. పైగా ఇదే వేదికపై తన పెళ్లి, పిల్లల గురించి కూడా నివేదా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ మూవీ గురించి అనౌన్స్ చేయడానికి ఒక ట్వీట్ వేస్తే ఏకంగా తన పెళ్లి అంటూ ఆర్టికల్స్ రాసేసారని, తన తల్లి వచ్చి ఆ ఆర్టికల్స్ చూపించేదాకా తనకు ఈ విషయం తెలియదని చెప్పింది. ఇక నిజంగానే తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ సినిమాలో తను యాక్ట్ చేసిన హీరోతో పాటు ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసింది. మూవీ రిలీజ్ అయ్యేదాకా అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకున్నా తనకేమీ ఇబ్బంది లేదని వెల్లడించింది.

రెండేళ్ల తరువాత రీ ఎంట్రీ

నివేదా థామస్ కొత్త చిత్రం 35-చిన్న కథ కాదు. ఈ మూవీకి నూతన దర్శకుడు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 35 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, ఆగష్టు 15న తెలుగు, తమిళం, మలయాళంలో రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు