NKR 21 Cast Update : నందమూరి హీరోకు తల్లిగా లేడీ సూపర్ స్టార్… టైటిల్ కంటే ముందే ఈ అనౌన్స్‌మెంట్

NKR 21 Cast Update : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అయితే అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కు తల్లిగా లేడి సూపర్ స్టార్ నటిస్తుండడం. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

NKR 21 అనౌన్స్మెంట్

డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. యంగ్ దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. దివంగత దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ పేరుతో ఎన్‌కెఆర్ 21 అప్డేట్ ను ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, అశోక క్రియేషన్స్‌ పతాకాలపై భారీ బడ్జెట్‌ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందనుంది. అంజనీష్ లోక్‌నాథ్ శస్ మవవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ NKR 21 గ్లిమ్స్ చూస్తే ఈ మూవీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. పైగా షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ ఇప్పటికే సైలెంట్ గా ఘాట్ ను మొదలు పెట్టేశాము అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

కళ్యాణ్ రామ్ కు తల్లిగా లేడి సూపర్ స్టార్

లేడి సూపర్ స్టార్ అనగానే ఇప్పుడున్న తరం అంతా నయనతార అనుకుంటారు. కానీ మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి. ప్రముఖ నటి విజయశాంతి NKR 21లో కీలక పాత్రలో నటించబోతోంది. గతంలో సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలక పాత్రను పోషించిన విజయ శాంతి ఆ తరువాత రాజకీయాలపై ఫోకస్ చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. మళ్లీ ఇన్నాళ్ళకు ఆమె కళ్యాణ్ రామ్ కు తల్లిగా సినిమాల్లోకి అడుగు పెడుతుండడం విశేషం. అయితే NKR 21 టైటిల్ ఏంటో ప్రకటించకముందే క్యాస్టింగ్ ను రివీల్ చేశారు.

- Advertisement -

NKR 21 First Glimpse Out: Nandamuri Kalyan Ram Teams Up With Pradeep  Chilukuri; Shoot In Progress | Watch

ఫ్లాఫ్ హీరోయిన్ తో రొమాన్స్

ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఇప్పటిదాకా రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ 2022లో గని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఏ ముహూర్తన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో ఏమో గానీ హిట్ అనే మాటే కరువైంది. ఫస్ట్ మూవీ గని డిజాస్టర్. ఆ తర్వాత రామ్ సరసన స్కంద అనే మూవీలో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇలా ఈ రెండు మూవీలు డిజాస్టర్ కావడంతో ఈ బాలీవుడ్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఇలాంటి సమయంలో కళ్యాణ్ రామ్ ఈ బాలీవుడ్ భామను పిలిచి మరీ అవకాశం ఇవ్వడం గమనార్హం. మరి ఈ మూవీ తోనైనా సాయి మంజ్రేకర్ టాలీవుడ్ లో హిట్ అందుకుని నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు