Gopi Chand: ఐదేళ్ల నుంచి ప్రాఫిట్స్ లేవు

2001 లో రిలీజ్ అయిన తొలివలపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో విలన్ రోల్ లో కనిపించాడు. జయం సినిమాతో నితిన్ హీరోగా పరిచయమయ్యాడు. జయం సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన గోపీచంద్ తనకి విలన్ గానే మంచి మంచి కెరియర్ ఉంది అనేలా ప్రూవ్ చేసుకున్నాడు.

ఆ సినిమా తర్వాత తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమాలో కూడా విలన్ గా కనిపించాడు. అయితే కేవలం తెలుగు జయం సినిమాలో మాత్రమే కాకుండా తమిళ్ లో రీమేక్ అయిన జయం సినిమాలో కూడా గోపీచంద్ విలన్ గా కనిపించాడు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమాలో కూడా విలన్ రోల్ ను పోషించాడు గోపీచంద్.

అయితే మళ్లీ యజ్ఞం సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత చేసిన ఆంధ్రుడు సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే కమర్షియల్ గా తనకంటూ ఒక హిట్ వచ్చిన చిత్రం మాత్రం రణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత చేసిన రారాజు సినిమా పరవాలేదు అనిపించింది. అయితే 2007లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఒక్కడున్నాడు సినిమా కమర్షియల్ గా హిట్ అవడంతో పాటు మంచి ప్రశంసలను కూడా తీసుకొచ్చింది.

- Advertisement -

ఆ తర్వాత లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్ వంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే 2014లో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత ఇప్పటివరకు గోపీచంద్ కెరియర్ లో సరైన హిట్ సినిమా అంటూ లేకుండా పోయింది. రాధాకృష్ణ దర్శకుడుగా పరిచయమైన జిల్ సినిమా పరవాలేదు అనిపించింది.

అయితే గోపీచంద్ నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినా కూడా గోపీచంద్ కి వరుస అవకాశాలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. గోపీచంద్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినా కూడా కంప్లీట్ డిజాస్టర్లు అయితే అయిపోవట్లేదు. ఏదో ఒక మోస్తరుగా ఆడుతున్నాయని చెప్పొచ్చు.

ఇకపోతే గత ఐదు సంవత్సరాలుగా గోపీచంద్ కి సరైన హిట్ సినిమా లేదు అని చెప్పొచ్చు. గౌతమ్ నంద సినిమా తర్వాత చేసిన ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలు సో సో గాని ఆడాయి. ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన సీటిమార్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా కొంతమేరకు మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇకపోతే గత ఐదేళ్లుగా ప్రాజెక్ట్స్ ఒకే, కానీ ప్రాఫిట్స్ మాత్రం రావట్లేదు. అయితే రీసెంట్ గా గోపీచంద్ నటించిన భీమా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈసారైనా ప్రాఫిట్ జోన్ లోకి గోపీచంద్ వస్తాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు