GOAT : విజయ్ క్రేజ్ తగ్గిందా? ఏంటి ఇలా జరిగింది?

GOAT : సౌత్ ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. ముఖ్యంగా తమిళనాట రజినీకాంత్ తర్వాత అంతగా అభిమానిస్తారు విజయ్ ని. ఇక సోషల్ మీడియాలో తిరుగులేని హీరో విజయ్. గత కొన్నేళ్లుగా కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు విజయ్. తన నుండి కొన్నేళ్లుగా ఏ సినిమా వచ్చినా అది హిట్టై కూర్చుంటుంది. కొన్ని సినిమాలకి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చినా భారీ కలెక్షన్లతో హిట్ చేసేటున్నారు అభిమానులు. ఇక రెండేళ్ల కింద బీస్ట్ అనే సినిమా మినహా మిగతా అన్ని సినిమాలు ఓ రేంజ్ బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. ఇక సోషల్ మీడియాలో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ నుండి సినిమా వస్తుందంటే, ఆ సినిమాకి సంబంధించిన సాంగ్ గాని, టీజర్, ట్రైలర్ గాని, ఆఖరికి మేకింగ్ వీడియోలు వచ్చినా సరే నిమిషాల్లో ట్రెండ్ అవుతుంటాయి. గంటల్లోనే మిలియన్ల రికార్డులు నమోదవుతుంటాయి. అసలు సౌత్ లో విజయ్ సినిమాలకి ఉన్న యూట్యూబ్ రికార్డులు ఎవరికీ లేవంటే అతిశయోక్తి కాదేమో. అలాంటిది రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గోట్’ (GOAT) సినిమా టీజర్ అంచనాలని అందుకోలేక చతికిలపడింది.

No response to GOAT movie teaser on YouTube

ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోయిన గోట్…

ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ లో విజయ్ సినిమాల టీజర్, ట్రైలర్స్ కి 24 గంటల్లో నమోదయ్యే రికార్డులపై మూవీ లవర్స్ అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఎలాంటి కొత్త రికార్డులైనా నెట్టింట విజయ్ పేరిట కనిపిస్తుంది. అయితే తాజాగా విజయ్ బర్త్ డే కి రిలీజ్ అయిన గోట్ సినిమా టీజర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. పైగా విజయ్ బర్త్ డే కి వస్తుంది కాబట్టి, విజయ్ ఫ్యాన్స్ కూడా అటెన్షన్ గా ఉన్నారు. విజయ్ టీజర్ వస్తే కొత్త రికార్డులు కంఫర్మ్ అని అందరూ అనుకోగా, టీజర్ 24 గంటల రిపోర్ట్ చుస్తే మాత్రం షాకిచ్చింది. గోట్ బర్త్ డే స్పెషల్ గ్లిమ్స్ కి 24 గంటల్లో 7.45 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా 485K లైక్స్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా నుండి వచ్చిన రెండో సాంగ్ ”చిన్న చిన్న కంగల్” పాటను స్వయంగా విజయే పాడినా కూడా 24 గంటల్లో 4.5 మిలియన్ వరకు వ్యూస్ 520K రేంజ్ లో లైక్స్ మాత్రమే సొంతం అయ్యాయి. రీసెంట్ టైంలో విజయ్ నటించిన మూవీస్ లో ఇవే వీకేస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న వీడియోలు అని చెప్పాలి.

- Advertisement -

విజయ్ క్రేజ్ తగ్గిందా?

ఇక విజయ్ సినిమా వీడియోస్ నెట్టింట ఓ రేంజ్ ట్రెండ్ అయ్యేవి. లాస్ట్ అరడజను సినిమాల లెక్కలు చూస్తే కూడా ప్రతి టీజర్ కి 1 మిలియన్ లైక్స్, ఉండేవి. కానీ ఈ టీజర్ కి ఇప్పటివరకూ అందులో సగమే వచ్చాయంటే విజయ్ క్రేజ్ తగ్గిందా అన్న అనుమానము నెట్టింట మొదలైంది. యూట్యూబ్ లో రికార్డుల రారాజుగా పేరున్న విజయ్ కొత్త సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ లేకపోయినా, మరీ ఇంత దారుణమైన రెస్పాన్స్ ను మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అయితే దీనికి పలు కారణాలు కూడా లేకపోలేదు. ఈ సినిమా విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండగా, బర్త్ డే టీజర్ ని అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయడం మైనస్ అయింది. అలాగే తమిళనాడులో జరిగిన కల్తీసారా వంటి ఘోరమైన ఘటనల వల్ల, ఈ టీజర్ ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఏది ఏమైనా గోట్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుండగా థియేటర్లలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు