Rana Daggubati : ఆ రెండు ఇండస్ట్రీలు నావే.. మనల్ని ఎవడ్రా ఆపేది.. రానా దూకుడు మామూలుగా లేదుగా..!

Rana Daggubati News: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుపాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడిగా.. నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రానా. అలాగే బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు.

ప్రజెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు రానా. ఇక మొన్నటి వరకు కెరీర్ లో ఆచితూచి అడుగులు వేసిన రానా ప్రెసెంట్ స్పీడ్ పెంచాడు. నార్త్ అండ్ సౌత్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ తన ఉనికి చాటేందుకు కసరత్తులు చేస్తున్నాడు. నిఖిల్ స్పై తో పాటు నవదీప్ లవ్ మౌళి లో కూడా నటించాడు రానా.

Rana is acting in a Bollywood period movie

- Advertisement -

ఇక త్వరలోనే పూర్తిస్థాయిలో సినిమాలు ఒప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే నార్త్ లో హౌస్ ఫుల్ 4 లో నటించిన రానా ప్రెసెంట్ అక్కడ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో హీరోయిన్ గా కృతి కర్బంద పేరు వినిపిస్తుంది. ఇక ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానున్నట్లు సమాచారం. అలా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ దూసుకుపోతున్నాడు రానా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు