Devara: ప్రస్తుతం తెలుగులో వెయిట్ చేస్తున్న మోస్ట్ క్రెజియస్ట్ ప్రాజెక్ట్స్ లో దేవర సినిమా ఒకటి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం. ఆచార్య వంటి సినిమా ప్లాప్ అయిన తర్వాత మళ్లీ దర్శకుడుగా నిలబడడానికి కొరటాల శివ చేస్తున్న ప్రయత్నం వలన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మామూలుగా కొరటాల శివకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ఉంది. వరుసగా స్టార్ హీరోస్తో సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్స్ అందుకున్నాడు. ఎవరికి రాని చిరంజీవితో పనిచేసే అవకాశం సాధించుకున్నాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
ఇకపోతే ప్రస్తుతం దేవర సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాడు నాగ వంశీ. మామూలుగా ఎన్టీఆర్ కి నాగవంశీ ఎంత పెద్ద అభిమాని అని అందరికీ తెలుసు. దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వకముందే ఈ సాంగ్ చాలా బాగుంటుంది. హుకుం సాంగుని మర్చిపోతారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ సాంగ్ చాలామందికి నచ్చి నాగ వంశీని పొగిడిన వాళ్ళు ఉన్నారు. అలానే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే నేడు దేవర సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్డేట్ రాకముందే చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు ఎన్టీఆర్ అంటూ ఇదివరకే రివీల్ చేశాడు నాగ వంశీ.
Fear will have a new face from this 27th September!
Proud to be associated with @tarak9999 anna’s epic action movie @DevaraMovie as distributors for Telugu states.
Gear up for #Devara Reign All Over the World!! pic.twitter.com/AnAYAI7tK6
— Naga Vamsi (@vamsi84) August 2, 2024
ఇక దేవర సినిమాకు సంబంధించి నాగ వంశీ ఇన్ని అప్డేట్స్ ఎందుకు ఇస్తున్నాడు అని చాలామందికి డౌట్ రాక మానదు. ఇక అసలు విషయం ఏంటంటే తెలుగు స్టేట్స్ లో దేవర సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు నిర్మాత నాగ వంశీ. ఎలా అయినా సరే హిట్టు కొట్టాలి అని సంకల్పంతో ఉన్నాడు కొరటాల శివ. అలానే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా ప్రాంసింగ్ గా ఉంది అని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అయితే డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి లాభాలు పొందుకుంటాడు నాగ వంశీ.
ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. దీన్నిబట్టి ఆరోజు ఓ జి సినిమా రాదు అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకి సరైన పోటీ లేకపోతే నాగ వంశీకి మరిన్ని లాభాలు వస్తాయి. మామూలుగా అయితే అదే రోజున ముందు నాగ వంశీ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కానీ కొన్ని డేట్స్ కుదరడంతో ఆ సినిమా ఇంకాస్త ముందుకు వచ్చింది.