NTR Birth Anniversary : కేవలం ఈ ఏడుగురు దర్శకులతో 100 చిత్రాలు చేసిన ఎన్టీఆర్..

NTR Birth Anniversary : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముని గా ప్రేక్షకులని అలరించిన ఎన్టీ రామారావు నాలుగు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమని ఏలాడు. ఈ క్రమంలో ఎందరో దర్శకులతో చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాలు చేసి అలరించారు. మరెన్నో చిత్రాలతో రికార్డులు నెలకొల్పారు. అయితే దర్శకుడి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు చేసిన కథానాయకుడు నందమూరి తారక రామారావు . కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎలా చెబితే అలా అన్నమాట! అయితే ఎన్టీఆర్ దాదాపు 300 వందలకు పైగా చిత్రాల్లో నటించగా, అందులో కేవలం 7గురు దర్శకులతోనే కలిసి 100 చిత్రాల్లో
నటించారు. ఇది చాలా మంది గమనించని విషయం. ఆ దర్శకులు ఎవరెవరో ఓ లుక్కేద్దాం.

NT Rama Rao made 100 films with only these 7 directors

ఎన్టీ రామారావు..

అయితే ఈ దర్శకుల్లో అందరికంటే ముందుండేది నటరత్న (NTR Birth Anniversary) ఎన్టీ రామారావు. అవును.. ఎన్టీఆర్ ఒక్క నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సినిమాల సంఖ్య 17. ఎన్టీ రామారావును ఎక్కువ సినిమాల్లో డైరెక్ట్ చేసిన రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది.

- Advertisement -

సి.ఎస్. రావు, యోగానంద్.. చెరో 16..

ఎన్టీఆర్ హీరోగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో రెండో స్థానంలో ఈ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరూ… ఆయనకు అత్యంత ఆత్మీయులుగా, ఆస్థాన దర్శకులుగా ముద్రపడిన సి.ఎస్. రావు, డి. యోగానంద్. ఎన్టీఆర్ హీరోగా చెరో 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

పౌరాణిక బ్రహ్మతో 15.. జానపద బ్రహ్మతో 14

ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా సినిమా ‘చంద్రహారం’. ఆ సినిమాకు కమలాకర కామేశ్వర రావు దర్శకుడు. ఆయనకు తొలి చిత్రమది. ఆ తర్వాత పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా 15 చిత్రాలకు కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. వాటిలో సింహ భాగం పౌరాణిక చిత్రాలదే. ఇక, జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ 14 చిత్రాలు చేశారు.

కేవీ రెడ్డితో 10 చిత్రాలు..

దర్శకులు కేవీ రెడ్డిని ఎన్టీఆర్ తన మార్గదర్శిగా భావించేవారు. వాళ్ళిద్దరి కలయికలో పది చిత్రాలు వచ్చాయి. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళభైరవి తోనే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు.

దర్శకేంద్రుడితో 12..

పౌరాణిక, జానపద చిత్రాలతో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, నవతరం దర్శకులతో కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో ‘అడవి రాముడు’ తో మొదలెట్టి మేజర్ చంద్రకాంత్ దాకా ఏకంగా 12 సినిమాలు చేసారు.

వీరే కాకుండా ఇంకా ఎల్వి ప్రసాద్ తో ఎనిమిది చిత్రాలు, అలాగే వేదాంతం రాఘవయ్య, వి. మధుసూదన రావు, ఎస్.డి. లాల్ ఉండగా, ఇక చెరో ఆరు చిత్రాలు తీసిన దర్శకుల్లో కె. హేమాంబరధరరావు, తాతినేని ప్రకాశ్ రావు, ఐదు సినిమాలు తీసిన దర్శకుల్లో పి. పుల్లయ్య, కె. బాపయ్య, దాసరి నారాయణరావు ఉన్నారు. అలాగే తాపీ చాణిక్య, బిఎన్ రెడ్డి తో చెరో నాలుగు సినిమాలు చేశారు ఎన్టీఆర్. వీరందరితో కలిసి దాదాపు 60 చిత్రాలు చేసారు ఎన్టీఆర్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు