NTR: అల్లు అర్జున్ ను బావ అంటాడు, బావని లోకేష్ అంటాడు

NTR: అల్లు అర్జున్ ను బావ అంటాడు, బావని లోకేష్ అంటాడుప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోస్ ఎన్టీఆర్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ టాలెంట్ ను చూసింది మాత్రం ట్రిపుల్ ఆర్ అనే సినిమాతో అని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోస్ అయిపోయారు. ఇకపోతే ప్రస్తుతం దేవర అనే సినిమాను చేస్తున్నారు ఎన్టీఆర్.ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో గుర్తింపు

నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఊహించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు ఎన్టీఆర్. ఆ తర్వాత విబి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా మంచి స్టార్ డంను తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమాతో ఒక మాస్ కమర్షియల్ హీరో అయిపోయాడు ఎన్టీఆర్.

 

- Advertisement -

S.S. Rajamouli

రాజమౌళితో ఉన్న అనుబంధం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి రాజమౌళితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలను చేశాడు తారక్. అలానే రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు కూడా వచ్చిందే అని అంటే దానికి కారణం రాజమౌళి.

ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం

సినిమాలు పరంగా ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఒకప్పుడు రాజకీయాల్లో మంచి బిజీగా ఉన్నాడు ఎన్టిఆర్. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు తల దూర్చలేదు. అయితే రీసెంట్ గా నారా ఫ్యామిలీకి నందమూరి ఎన్టీఆర్ కి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కొన్ని విషయాలపై ఎన్టీఆర్ స్పందించడం కూడా మానేసాడు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విష్ చేశారు.

లొకేష్ ను పట్టించుకోలేదా

ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వ్యక్తుల్లో మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా ఒకరు. లోకేష్ ఎన్టీఆర్ కి బావ అవుతాడని అందరికి తెలిసిందే. అయితే లోకేష్ కి రెస్పాన్స్ గా థాంక్యూ లోకేష్ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్ కి మాత్రం థాంక్యూ బావ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే దీనితో సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. అల్లు అర్జున్ ను బావ అంటాడు, బావని లోకేష్ అంటాడు. అంటూ కొంతమంది మీమర్స్ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు