NTR – ANR: వీరి అహాన్ని దెబ్బతీసిన స్టార్ హీరోయిన్.. అందుకే బ్యాన్.!

NTR – ANR: టాలీవుడ్ సినీ పరిశ్రమకు రెండు కళ్ళ లాంటివారు అనగానే వెంటనే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ పేర్లు చెప్పేస్తారు. ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్ఆర్ సినీ పరిశ్రమకి వచ్చినా..ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకొని ఏఎన్ఆర్ తో పోటీపడి మరీ నటించేవారు.. అంతేకాదు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చాలా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. సాంఘిక, పౌరాణిక , చారిత్రక, జానపద చిత్రాలకు వీరిద్దరూ పెట్టింది పేరు.. అంతేకాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించారు. విభిన్నమైన కథాంశాలతో కడుపుబ్బా నవ్వించడమే కాదు కంటినిండా ఏడిపించగలరు కూడా.. నటన అంటే వీరిది.. నాట్యం అంటే వీరిది. ఇక వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అటు సినిమాలలో చక్రం తిప్పిన వీరు రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు. ఏఎన్ఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా .. ఎన్టీఆర్ మాత్రం అతి తక్కువ సమయంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి ఎన్నో పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి.. ఇప్పటికీ ఆ పథకాలు ప్రజలకు చేరేలా వారి ప్రతినిధులు జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే.. అంతలా సినీ పరిశ్రమకు ఇటు రాజకీయ రంగానికి న్యాయం చేశారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల అహాన్ని దెబ్బతీసిన స్టార్ హీరోయిన్..

NTR - ANR: The star heroine who hurt their ego.. hence the ban.!
NTR – ANR: The star heroine who hurt their ego.. hence the ban.!

ఇకపోతే ఇంతటి గొప్ప నటుల అహాన్ని దెబ్బతీసింది ఒక స్టార్ హీరోయిన్.. దీంతో ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ కూడా చేశారు.. అయితే మరి ఆమె ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

అసలు విషయంపై క్లారిటీ ఇచ్చిన జమున..

ఆమె ఎవరో కాదు జమున.. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సావిత్రితో పోటీపడి మరీ వెండితెర సత్యవతిగా పేరు దక్కించుకుంది.. ఎన్టీఆర్ ,ఏఎన్నార్ లతో జమున చేసిన మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలు టాలీవుడ్ క్లాసిక్స్ అనే చెప్పాలి. ఇలా ఇండస్ట్రీ నే ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్లను కూడా ఢీ కొట్టింది.. ఆత్మాభిమానం కోసం కెరియర్ నే పణంగా పెట్టింది. మరి ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో ఆమె ఎందుకు విభేదించాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే.. ఇదే విషయంపై జమున గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ తనకు అందరూ వంగి వంగి నమస్కారాలు చేయాలి అనుకుంటారు.. నేను ఆ టైప్ కాదు.. మనం వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి.. అందుకే ఏఎన్ఆర్ ఇండస్ట్రీ నుంచి నన్ను బ్యాన్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ తో కూడా చేయించాడు.. ఇద్దరు నా మీద నిందలు వేశారు.. తప్పుడు ప్రచారాలు చేశారు.. జమున పొగరుబోతు.. కాల మీద కాలేసుకుని కూర్చుంటుంది.. సమయానికి రాదు.. ఆలస్యంగా వస్తే క్షమాపణలు చెప్పదు అంటూ మూడేళ్ల పాటు నాతో వారు నటించలేదు..

- Advertisement -

వారివల్లే సఖ్యత..

ఇక వీరు కాకపోతే ఇక ఇండస్ట్రీలో హీరోలే లేరా అనుకుని జగ్గయ్య, హరనాథ్, శ్రీధర్, రమణమూర్తి వంటి కొత్త హీరోలతో సినిమాలు చేశాను.. ఇక జగ్గయ్య, హరనాథ్ లతో సినిమాలు చేస్తే.. నా కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది.. ముఖ్యంగా హరినాథ్ తో సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.. ఆ సమయంలో అతడు తాగుడుకు అలవాటుపడ్డాడు.. ఒకసారి షూటింగ్ కి తాగి వస్తే నేను నటించను అని సెట్స్ నుంచి వెళ్ళిపోయాను.. ఆయన భార్య కాల్ చేసి ఇకపై తాగి రాడు మేడం అంటూ రిక్వెస్ట్ చేసింది. దానితో ఒప్పుకున్నాను.. ఇక మూడేళ్ల తర్వాత గుండమ్మ కథలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్లతో నటించాను. గుండమ్మ కథ కోసం నాగిరెడ్డి చక్రపాణి మామధ్య సఖ్యత కుదిర్చి ఎన్టీఆర్ , ఏఎన్నార్లను కాంప్రమైజ్ చేయడంతో అప్పుడు మేము కలిసి నటించాము అంటూ చెప్పుకొచ్చింది జమున.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు