NBK 50 Years Celebrations : తారక్‌కు ఆహ్వానం అందకపోవడానికి కారణం బాలయ్య కాదా..? ఫ్యామిలీ మొత్తం పక్కన పెట్టారా..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. తాతమ్మకళ సినిమాతో బాలకృష్ణ (Balakrishna) సినిమాల్లోకి ప్రవేశించారు. బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుకను పురస్కరించుకొని సినీ పరిశ్రమ పెద్దలు సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీరంగ, రాజకీయ ప్రముఖులందరూ, సీఎంలు కూడా రాబోతున్నారు. నందమూరి కుటుంబం చాలా పెద్దది. సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు, వారి కుటుంబాలు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు. అందుకే బాలకృష్ణ 50 ఏళ్ల ఫంక్షన్ కు వారందరినీ పిలిచే బాధ్యతను నందమూరి రామకృష్ణకు అప్పగించారట. ఎందుకంటే ఆయనకు అందరితో మంచి సంబంధం ఉంటుందట. ముఖ్యంగా హరికృష్ణ పిల్లలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పిలిచే బాధ్యతను కూడా నందమూరి రామకృష్ణకే అప్పగించారని సమాచారం అందుతోంది.

అందువల్ల ఎన్టీఆర్ (NTR), కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు వస్తారా లేదా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి వారికి తెలియదని….అదంతా రామకృష్ణనే చూసుకుంటారని చెబుతున్నారు సీనియర్ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతికి సిటీలో లేకపోవడం వల్ల రాలేదని…. మరి ఈసారి వారి షూటింగ్ టైమింగ్స్ ఏమిటో తమకు తెలియదని చెప్పారు. అదంతా రామకృష్ణ చూసుకుంటారన్నారు. నందమూరి కుటుంబమంతా బాలయ్య (Balakrishna) ఇంటికి చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ఒక బస్సులో వచ్చేలా ప్లానింగ్ ఉందట.

- Advertisement -

Junior NTR For Balakrishna NBK50Years Celebrations

అక్కినేని నాగార్జున వస్తారో రారో ఇంకా కన్ఫామ్ కాలేదని….నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని….అందువల్ల ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ కు చైతన్యను పంపించారని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి రాకపోతే.. ఆ ఇష్యూ బాలయ్యపైన పడకుండా.. ఇలా నందమూరి కుటుంబం డైవర్ట్‌ చేస్తోందని అంటున్నారు. రామకృష్ణ పిలవలేకపోవడం వల్లే ఎన్టీఆర్‌ రాలేదనే మీనింగ్‌ వచ్చేలా ఫ్యామిలీ కుట్రపన్నుతోందని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు