NTR – Neel Movie Shooting Update : 15 దేశాల్లో షూటింగ్‌కి ప్రశాంత్ ప్లాన్… ఇది రాజమౌళి సినిమాకి మించి..!

NTR – Neel Movie Shooting Update..టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ కూడా ఒకటి. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ సీక్వెల్ అయిపోయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో దేవర రెండు భాగాలలో నటించబోతున్నారు. అలాగే బాలీవుడ్లో మొట్టమొదటిసారిగా వార్-2 లో నటిస్తున్నారు.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ షూటింగ్ షురూ..

NTR - Neel Movie Shooting Update : Prashanth plans to shoot in 15 countries... This is more than Rajamouli's movie..!
NTR – Neel Movie Shooting Update : Prashanth plans to shoot in 15 countries… This is more than Rajamouli’s movie..!

ఈ రెండు చిత్రాలు అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనే సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 31 అనే సినిమాతో పోస్టర్ ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.. ఆ తర్వాత మరి ఎలాంటి అప్డేట్ ని కూడా చిత్ర బృందం తెలియజేయలేదు.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి పలు రకాల ఊహాగానాలు అయితే వినిపించాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ రెగ్యులర్ గా ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించబోతున్నారని.. ఈ సినిమా షూటింగ్ ను మెక్సికో లో ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది

15 దేశాలలో షూటింగ్..

ఎన్టీఆర్-31 చిత్రం దాదాపుగా 15 దేశాలలో చిత్రీకరించే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.. ముఖ్యంగా ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఈ సినిమా కూడా ఒకటి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ గానీ , ఎన్టీఆర్ గానీ ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ దేవర, వార్ -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..

- Advertisement -

రాజమౌళి మూవీని మించి..

ఎన్టీఆర్-31 చిత్రంలో నటీనటులు హీరోయిన్స్ విషయం పైన ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.. గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రాలు అన్నీ కూడా హీరోలని హైలెట్ చేస్తూ చూపించారు.. ముఖ్యంగా హీరో యష్, ప్రభాస్ లను చూపించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకోవడంతో.. ఇక ఎన్టీఆర్ తో సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే విధంగా ముద్ర పడిపోయింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్ కి చాలా ఇష్టమని కూడా ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.. మరి అలాంటిది తమ అభిమాన హీరోని ఎలా చూపిస్తారో అంటూ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా షూటింగ్ 15 దేశాలలో జరగబోతుంది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా రాజమౌళి RRR సినిమా కంటే మించి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి ఎన్టీఆర్ కి ప్రశాంత్ ఏ విధమైన గుర్తింపును అందిస్తారో చూడాలి. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఈ అవకాశాన్ని దక్కించుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు