Ntr New Look : స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. అబ్బా ఏమున్నాడు భయ్యా..

Ntr New Look : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాలను చేస్తున్నాడు.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఎన్టీఆర్ దేవర లోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం థాయ్ లాండ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. తన ఫ్యామిలీతో కలిసి ఆయన అక్కడకు వెళ్లారు.. అయితే తాజాగా ఆయన షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు.. ఈ క్రమంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోని కెమెరాలు ఆయనను క్లిక్ మనిపించాయి.. ఆ ఫోటోలు , వీడియోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ వైట్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

ntr new look photos viral in social media
ntr new look photos viral in social media

దేవర సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తుంది.. మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.. జాన్వీ కపూర్ పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అనిరూద్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేస్తుంది.. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు