Jr. Ntr : దేవర కోసం ఎన్టీఆర్ త్యాగం.. ఇదే కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Jr. Ntr : నందమూరి తారకరామారావు మనుమడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకోవడం మాత్రమే కాదు. అభిమానులను పెంచుకుంటూ వస్తున్నాడు.. ఏ పాత్రలో నటించిన కూడా ఆయన లాగా ఎవ్వరూ చెయ్యలేరు అన్నంతగా ఒదిగిపోయి నటిస్తాడు. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు.. గతంలో త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం పెద్ద త్యాగమే ఎన్టీఆర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం చేశాడంటే..

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది చిత్ర బృందం. దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.. అయితే ఈ టైం లో ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో దేవర సినిమా కంటే ముందుగానే ఒక సినిమాని చేయవలసి ఉన్నదట.. ఆ చిత్రము ఏదో కాదు విక్రమ్.. అయితే ఈ ప్రాజెక్టుకి ఎన్టీఆర్ సైతం ఒప్పుకోలేదట.. అందుకు కారణం కొరటాలకు ఎన్టీఆర్ ఇచ్చిన మాటే..

NTR rejected Lokesh Kanakaraj's movie for Devara
NTR rejected Lokesh Kanakaraj’s movie for Devara

అందుకే విక్రమ్ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. గతంలో దీనిపై వార్తలు కూడా వినిపించాయి. డైరెక్టర్ లోకేష్ కి ఇబ్బంది వస్తుందని ఆలోచించి ఆ సినిమానే వదిలేసుకున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా.. ఈ వార్త నెట్టింట షికారు చెయ్యడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. పాన్ ఇండియా లేవల్లో మార్కెట్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇతర దేశాలలో కూడా తన సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడేలా కొత్త ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు