NTR: ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సీరియల్ బ్యూటీ..!

NTR: టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు..RRR చిత్రంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశారు.. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలవగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ సినిమాని చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా గత ఏడాది ప్రకటించారు కూడా.. అలాగే వార్-2 సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదంతా ఎలా ఉండగా ఎన్టీఆర్ 31వ సినిమాపై నటీనటుల విషయంలో భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో నటించబోయే ఒక నటి గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రముఖ తెలుగు చానల్స్ లో ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఇందులో యాక్టర్ జ్యోతి రాయ్ (జగతి మేడమ్) ఇందులో నటిస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అవకాశం అందుకున్నట్లుగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఆ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈమె కన్నడ సినిమా ఆర్టిస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతోనే ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

NTR: The serial beauty got a chance in NTR's movie..!

ప్రముఖ కన్నడ మీడియాలో ఈ వార్త రావడంతో జ్యోతి రాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో ఈ విషయాన్ని షేర్ చేయడంతో నిజం గానే అవకాశం వచ్చిందేమో అన్నట్లుగా.. అందుకే జగతి మేడమ్ ఇలా హింట్ ఇస్తోంది అంటూ పలువురు అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సలార్-2 సినిమా మొదలుపెట్టడానికి ఇంకా కాస్త సమయం ఉంది కనుక.. ఎన్టీఆర్ తో 31 వ సినిమాని పూర్తిచేసే పనిలో పడ్డారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరి అఫీషియల్ గా ఇందులోని నటీనటుల గురించి చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు