Ntr : ఏపీ, తెలంగాణా వరద భాధితులకు ఎన్టీఆర్ భారీ సాయం..

Ntr : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Ntr) సినిమాలే కాదు కష్టంలో ఉన్న వారికి సాయం చెయ్యడంలో వెనక్కి మాత్రం తగ్గడు. అందుకే ఎన్టీఆర్ ను నందమూరి అసలు వారసుడు అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతుంటారు. తాజాగా ఎన్టీఆర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళ వరద బాధితులకు సాయం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురిసిన వరదలకు చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వారిని ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా రెండు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఆ ట్వీట్ లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తూ భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నారు.

NTR's huge help to AP and Telangana flood victims..
NTR’s huge help to AP and Telangana flood victims..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తర్వాత దేవర ( Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva ) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటివరకు సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిసిందే.. అలాగే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ( Hruthi Roshan ) తో వార్ 2 సినిమాను చేస్తూన్నాడు.. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు