OG: ఓ జి టీజర్ పై తన రెస్పాన్స్ తెలియజేసిన హరీష్ శంకర్

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వరుసగా 7 హిట్ సినిమాలు చేసిన తర్వాత, వరుసగా పదేళ్లపాటు ఒక హిట్ సినిమా కూడా లేదు. ఎన్నో అంచనాలతో థియేటర్స్ కి వెళ్ళిన ప్రేక్షకులకు ప్రతిసారి నిరాశ మిగులుతూనే ఉంది. ఖుషి సినిమా తర్వాత సరైన హిట్ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఫెయిల్ అయిన కూడా రెమ్యూనరేషన్ క్రేజ్ మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన జల్సా(Jalsa) సినిమా పరవాలేదు అనిపించుకుంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్లో స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ సినిమా అంటే గబ్బర్ సింగ్(Gabbar Singh) అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అని అనుకుంటారు అచ్చం అలా చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ సినిమాతోనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకి దేవుడైపోయాడు. చాలామంది అభిమానులు ఆ సినిమాను చూసి విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సుజిత్ కూడా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిన తర్వాత సుజిత్ బయటకు అరుస్తూ వచ్చిన వీడియోలు పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే వైరల్ గా మారాయి.

OG

- Advertisement -

ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత కూడా కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సందర్భంగా చాలా మందితో హరీష్ శంకర్ ముచ్చటించారు. అయితే ఒక అభిమాని ఓజీ టీజర్ గురించి అడిగినప్పుడు, గబ్బర్ సింగ్ సెలబ్రేషన్స్ కూడా గుర్తు చేస్తూ సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో నాకు తెలుసు, ఓజి టీజర్ కుమ్మేశాడు అంటూ తన రెస్పాన్స్ని తెలియజేశాడు హరీష్ శంకర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు