Og: ఓజీ పోస్ట్ ఫోన్ ఖాయమైనట్లేనా, అదే డేట్ కి మరో పాన్ ఇండియా సినిమా

Og: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ వరుసగా 7 బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత, పదేళ్లపాటు ఒక హిట్ సినిమా కూడా లేకుండా పోయింది. అయితే సినిమాలు డిజాస్టర్ అవుతున్నకొద్దీ పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరిగింది. అయితే గబ్బర్ సింగ్ సినిమా పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓ.జి.

ఓ జి సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సుజిత్ చేసిన హడావిడి వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇదే తారీఖున దాదాపు 10 ఏళ్ళు క్రితం అత్తారింటికి దారేది అనే సినిమా రిలీజ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే అదే డేట్ న ఈ సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఆ డేట్ కి ఈ సినిమా రావట్లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Devara

- Advertisement -

సెప్టెంబర్ 27న ఓ జి సినిమా రిలీజ్ పై చాలామందికి నమ్మకం లేకపోవడం వలన. అదే డేట్ కు మరికొన్ని సినిమాలను అనౌన్స్ చేసే పనిలో పడ్డారు కొంతమంది దర్శక నిర్మాతలు. నిర్మాత నాగ వంశీ అదే డేట్ కి లక్కీ భాస్కర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా అదే డేట్కు రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై ఎండ్ కి ఈ సినిమా పూర్తి చేయమని ఎన్టీఆర్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు