OG: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం , నిర్మాతలు నన్ను క్షమించాలి అంటూ…

OG: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా ఏడు హిట్ సినిమాలు చేశాడు. ఇకపోతే ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్లపాటు హిట్ సినిమా చూడలేకపోయాడు. అయితే ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ఇకపోతే కేవలం సినిమాలలోనే కాకుండా మరోవైపు రాజకీయాల్లో కూడా ప్రస్తుతం బిజీగా మారాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే ప్రశ్నించడమే ద్వేయంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్లారు. 2019లో పోటీ చేసిన కూడా రెండు చోట్ల ఓడిపోయారు. అయితే అక్కడితో పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా విమర్శలు మొదలయ్యాయి. అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ 2024లో అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 లో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రను పోషించారు. దాదాపు ఒక సీఎంని డిసైడ్ చేసే స్థాయికి వచ్చారు అని అనడంలో కూడా అతిశయోక్తి లేదు.

pawan kalyan

- Advertisement -

ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత సినిమాలకు ఎప్పుడు డేట్లు ఇస్తారు అంటూ చాలామంది ఆలోచనలో పడిపోయారు. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓజి సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఓజి అని అరవగా, ఒక మూడు నెలల పాటు రోడ్లు అవి బాగు చేసిన తరువాత సినిమాకి ఖాళీగా ఉన్నప్పుడు రెండు, మూడు రోజులు కేటాయిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సినిమాలకు చాలా తక్కువ టైం పవన్ కళ్యాణ్ ఇస్తాడు అని తెలియగానే చాలామంది అభిమానులు ఆందోళనలో పడిపోయారు. అలానే సినిమాలకు సంబంధించి డేట్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నందుకు నిర్మాతలు కూడా నన్ను క్షమించాలి అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు