OG: అకిరా నందన్ గురించి ఈ యంగ్ హీరో ఏం చెప్పాడంటే.!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైం పీక్ లో నడుస్తుంది అని చెప్పొచ్చు. ఒకవైపు సినీ పరిశ్రమలోనూ మరోవైపు రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఎక్కువగా బయట కనిపిస్తున్నారు ఆయన కొడుకు అకీరా. ఇదివరకు అప్పుడప్పుడు మాత్రం ఇంస్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ఫొటోస్ పెట్టడం ద్వారా కనిపించే అకీరా ఇప్పుడు మాత్రం తన తండ్రి తో పాటు ఎక్కడపడితే అక్కడే దర్శనం ఇస్తున్నాడు.

అలానే పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ అయితే ఖచ్చితంగా అకీరా అక్కడ కనిపిస్తాడు. ప్రతి సినిమాకి కూడా అకీరా వచ్చి ఫ్యాన్స్ కి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతాడు. అలానే అకీరా ఎంట్రీ కోసం కూడా చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అకీరాకి అడవి శేష్ ఎంత పెద్ద ఫ్రెండ్ అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. అలానే శేష్ కి ఒక మ్యూజిక్ వీడియో ని కంపోజ్ చేసి పంపించాడు అకిరా. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. అకీరా చదివిన ఎన్నో పుస్తకాలను శేష్ కి సజెస్ట్ చేసేవాడు.

#OG

- Advertisement -

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి ఫ్యామిలీ తో పాటు ఫ్రెండ్స్ తో కూడా దర్శనం ఇచ్చాడు అకీరా. ఈ సినిమాకి కల్కి సినిమాకి సంబంధించి టీ షర్ట్స్ కూడా వేసుకుని వచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా గురించి అందరు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అలానే అకీరా కూడా సినిమా కోసం, అకిరా ఫాదర్ ఆ సినిమాలో ఎలా కనిపిస్తారు అని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అడవి శేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు