Om Raut : ఆ ఆర్మీని పట్టించుకోను… ఆదిపురుష్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Adi Purush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhash ) , బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆది పురుష్(Adi purush). ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉండేవి. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత చాలా దారుణమైన ట్రోల్స్ కి గురైంది. ఆ తర్వాత సినిమా కూడా విడుదలైనా అంతే ఘోరంగా ఆది పురుష్ చిత్రాన్ని ట్రోల్స్ చేశారు. ఇలాంటి సినిమా కా అంతటి భారీ బడ్జెట్ పెట్టింది అనే విధంగా చాలామంది ప్రేక్షకులు కూడా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇలా అన్ని పాత్రలపైన కూడా విమర్శలు ఎదురయ్యాయి.

Om Raut : I don't care about that army... Sensational comments of Adipurush director
Om Raut : I don’t care about that army… Sensational comments of Adipurush director

ట్రోల్స్ లెక్కచేయని డైరెక్టర్..

అందరూ కూడా ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయి అనే విధంగా మాట్లాడుకున్నారు. కానీ ఇటీవలే ఈ సినిమా ఫలితం పైన డైరెక్టర్ ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడియన్స్ అంచనాలను ఆదిపురుష్ సినిమా అందుకో లేకపోయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది అంటూ తెలియజేశారు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఒక గ్యాంగ్ ఉంటుంది. వారు ఎవరో ముక్కు ముఖం తెలియని వారు.. అలాంటి ఆర్మీ చేసే కామెంట్స్, ట్రోల్స్ ను సైతం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా తెలియజేశారు.

సినిమా ఫ్లాప్ కాలేదన్న డైరెక్టర్..

ఏ సినిమా అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని కీలకంగా తీసుకుంటారని కూడా తెలిపారు. అందుకే తమ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది అని తెలిపారు. మొదటి రోజే దేశవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. మొత్తం మీద రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని తెలిపారు డైరెక్టర్ ఓం రౌత్. ఆంధ్ర , తెలంగాణ రెండు రాష్ట్రాలలో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని తెలిపారు డైరెక్టర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలామంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

మనోభావాలు దెబ్బతీశాయన్న ఆడియన్స్..

భారీ బడ్జెట్ సినిమాలు ఖర్చు పెట్టినప్పటికీ సినిమాని మంచిగా తెరకెక్కించాలని తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా చేసుకుని తీసిన ఆది పురుష్ చిత్రం సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. గత ఏడాది జూన్ నెలలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులోనే కొన్ని సన్నివేశాలు సైతం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని చాలామంది డైరెక్టర్ ఓం రౌత్ ను కూడా తప్పు పట్టారు. ముఖ్యంగా ఇందులో రాసిన డైలాగులు కూడా విమర్శలకు దారితీసాయని, చాలామంది ఫైరయ్యారు. దీంతో మనోజ్ ముంతాషీర్ శుక్లా కూడా క్షమాపణలు తెలియజేయడం జరిగింది. అలా మొత్తానికైతే సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ వస్తున్న వార్తలకు డైరెక్టర్ క్లారిటీ ఇస్తూ.. తమ చిత్రం ఫ్లాప్ కాలేదని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వచ్చాయని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు