Orange : ప్లాప్ సినిమాతో రీ రిలీజ్.. రికార్డుల బెండు తీస్తున్న గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అద్భుతమైన లవ్ స్టోరీ ఆరెంజ్. 2010 లో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ఫెయిల్ అయిన ఈ సినిమా టెలివిజన్ లో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. పాటలు ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉండటం సినిమాకి బాగా కలిసి రాగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మార్చి 25,26,27 తేదీల్లో ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేసారు.

కాగా సినిమా ఎక్కువ థియటర్లలో రిలీజ్ చేయకున్నా డిమాండ్ ఉన్న ఏరియాల్లో మాత్రమే విడుదలై ఎక్స్ ట్రా షో లతో రచ్చ రచ్చ చేసింది. ఇక తొలి రోజు ఆర్ టీ సి క్రాస్ రోడ్ లో మాత్రమే 13/13 షో లు హౌస్ ఫుల్ పడగా ఏకంగా 17.41 లక్షల గ్రాస్ ని వసూలు చేసి అల్ టైం రికార్డు ని క్రియేట్ చేసి ఒక్కడు పేరు మీదున్న 16.98 లక్షల రికార్డు బ్రేక్ చేసింది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నైజాం లో తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ 74 .89 లక్షల గ్రాస్ ని వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసి టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో 4 వ స్థానం దక్కించుకుంది. ఇక టాప్ 5 లో ఉన్న రీ రిలీజ్ మూవీస్ లో మొదటి అయిదు స్థానాలు గమనిస్తే ఒకటో స్థానం లో ఖుషి 1.65 కోట్లు, రెండో స్థానంలో జల్సా 1.26 కోట్లు, మూడో స్థానంలో ఒక్కడు 90 లక్షలు, నాలుగో స్థానంలో ఆరెంజ్ 75లక్షలు, 5వ స్థానంలో పోకిరి 69 లక్షలు వసూలు చేసి టాప్ 5 లో కొనసాగుతున్నాయి. కేవలం హైదరాబాద్ కలెక్షన్స్ ని మాత్రమే చూసినట్లయితే ఖుషి మొదటి స్థానంలో ఆరెంజ్ రెండవ స్థానంలో ఉంటాయి.

- Advertisement -

అయితే ఆరెంజ్ సినిమా ఖుషి, జల్సా, ఒక్కడు, పోకిరి సినిమాల కంటే తక్కువ థియేటర్లలో విడుదలై ఈ కలెక్షన్స్ వసూలు చేయగా, మిగతా 2 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. దాన్ని బట్టి ఓవరాల్ గా ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ ని సాధించిందో, నైజాం కింగ్ ఎవరో తెలిసిపోతుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ ని నిర్మాత నాగబాబు జనసేన పార్టీ కి విరాళంగా ఇవ్వనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు