Ori Devuda : పెద్ద హిట్ అవ్వాలి

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు రాజమండ్రిలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

రామ్ చరణ్‌ మాట్లాడుతూ.. ‘పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. మా వెంకటేష్ గారు చేసిన రోల్ చాలా ఇంపాక్ట్‌గా ఉంది. వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారులేరు. ఆయనకు అంతటా అభిమానులున్నారు. యూత్, రెబల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆయన బయట ఉండే పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. రజినీకాంత్, పవన్ కళ్యాణ్‌, చిరంజీవిల సినిమాలు హిట్ అవుతాయ్.. ఫ్లాప్ అవుతాయి. కానీ ఎల్లప్పుడూ సూపర్ స్టార్‌గా ఉండాలంటే.. పర్సనాలిటీ నిండుగా ఉంది. అలానే ఉండనివ్వు. ఈ చిత్రం అక్టోబర్ 21న రాబోతోంది. ఈ దీపావళికి ఈ సినిమా బాగుంటుందా? ఈ సినిమా వల్ల దీపావళి బాగుంటుందా? నాకు తెలియదు గానీ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలి. నేను మాత్రం ఈ సినిమాను చూస్తాను. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ రామ్ చరణ్ అన్న ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్. మీ జర్నీతో మేం ఎంతో ఇన్‌స్పైరింగ్. అంత పెద్ద బ్యాగేజీ, మెగాస్టార్ కొడుగ్గా పుట్టి.. ఈ స్థాయి వరకు రావాడం మామూలు విషయం కాదు. రామ్ చరణ్‌లా ఎంతో క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాను. ఇది నా లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటాను. ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్ అన్నా. ఫలక్‌నుమా దాస్ సినిమా కోసం నాని వచ్చాడు. ఆ సినిమా ట్రైలర్‌ను వెంకటేష్ గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో దేవుడి పాత్రను చేశారు. సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. మళ్లీ సక్సెస్ మీట్ పెడతాం. అప్పుడు మాట్లాడతాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు