Oscar: ఏకంగా 7 సినిమాలు పంపిన ఇండియన్ హీరో.. ఎవరంటే..?

Oscar.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ కూడా ఒకటి.. ఒక్కసారి ఆస్కార్ లభించింది అంటే ఆ వ్యక్తికైనా , ఆ సినిమాకైనా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించాల్సిందే. అందుకే చాలామంది నటీనటులు ఈ ఆస్కార్ అవార్డును దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే ఇక్కడ ఒక ఇండియన్ హీరో ఏకంగా 7 సినిమాలను ఆస్కార్ కోసం పంపి రికార్డు సృష్టించారు.

Oscar: Indian hero who sent 7 movies simultaneously.. Who is..?
Oscar: Indian hero who sent 7 movies simultaneously.. Who is..?

అసలు విషయంలోకి వెళితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ నటులలో ఒకరైన కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన నటనతో తన కెరియర్లో అనేక అవార్డులు , నామినేషన్లు కూడా పొందారు. స్వయంగా ఆస్కార్ కు నామినేట్ కానప్పటికీ తాను నటించిన చాలా చిత్రాలు ఆస్కార్ నామినేషన్ కోసం పోటీ పడ్డాయి. అంతేకాదు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పరిశీలనకు నోచుకున్నాయి కూడా.. ముఖ్యంగా ఏడు సినిమాలను ఆస్కార్ రేస్ లోకి పంపారు కమల్ హాసన్.. కానీ ఆస్కార్ నామినేషన్లకు పంపిన చిత్రాలలో ఐదు తమిళ్ చిత్రాలు కాగా, రెండు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విషాదకరం ఏమిటంటే.. ఏకంగా ఏడు చిత్రాలను నామినేషన్ కి పంపించారు.. కానీ ఏ ఒక్కటి కూడా ఆస్కార్ అవార్డును పొందలేక పోయింది. మరి కమలహాసన్ ఆస్కార్ కోసం పంపిన ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హే రామ్:

2000 సంవత్సరంలో కమలహాసన్ నటనా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది.. ఇందులో రాణి ముఖర్జీ, షారుక్ ఖాన్, వసుంధర దాస్ తదితరులు నటించారు. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తమిళ్ , హిందీ రెండిట్లో కూడా విడుదలయింది. వాణిజ్య పరంగా మంచి విజయం సాధించి.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

- Advertisement -

భారతీయుడు:

1996లో విడుదలైన చిత్రం ఇది. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. సుకన్య , మనీషా కొయిరాలా , ఊర్మిళ మటొండ్కర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. ఇందులో కమలహాసన్ అసాధారణ నటనా ప్రతిభకు గొప్ప పేరు లభించింది.

కురుతిపునల్:

పీసీ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ , అర్జున్ , గౌతమి , నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.. 1995లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా మంచి విజయాన్ని అందుకుంది. హింస తీవ్రవాదం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తేవర్ మగన్:

1992లో విడుదలైన ఈ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ హాసన్, నాజర్ , శివాజీ గణేషన్, రేవతి, గౌతమి తదితరులు కీలకపాత్రలు పోషించారు. రెండు గ్రామాలను విడదీసే కులపోరు, ప్రజల మధ్య ఉన్న అనైఖ్యతను అరికట్టడానికి ఒక కుటుంబం తమ సర్వస్వాన్ని ఎలా త్యాగం చేసింది అనేది సినిమా నేపథ్యం. ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ చిత్రాలతో పాటూ నాయకన్ అలాగే మరో రెండు హిందీ చిత్రాలను ఈయన ఆస్కార్ కి పంపించారు. ఇకపోతే ఆస్కార్ రావాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. పెట్టుబడి కూడా అవసరం అని నిరూపణ అయింది.. భవిష్యత్తులో సౌత్ ఇండియా నుంచి కూడా ఆస్కార్ పోటీలో రాణించే సినిమాలు వస్తున్నాయి అన్న భరోసా ఇప్పుడు ఉంది .మరి ఏ సినిమా ఆస్కార్ ను అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు