Pa Ranjith: ఆ సంఘటనలే తంగలాన్ సినిమా చేసేలా చేసింది

Pa Ranjith: సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే అని కొంతమంది దర్శకులు భావిస్తే, అతి తక్కువ మంది దర్శకులు మాత్రం సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫారం ఏ విషయాన్ని అయినా అక్కడ చెబితే చాలామందికి రీచ్ అవుతుంది అని నమ్ముతారు. ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సినిమాకి ఉంటుంది. ఒక మనిషి ఆలోచనలలో మార్పు తీసుకొచ్చే శక్తి సినిమాకి ఉంటుంది. ఒక మనిషిని మార్చగలిగే శక్తి సినిమాకి ఉంటుంది. చాలామంది దర్శకులు కొన్ని కథలను చెబుతారు. ఆ కథలు కొన్ని వాస్తవిక సంఘటనలను చూసి కావచ్చు, కొన్ని ఊహల్లో నుంచి పుట్టినివి కావచ్చు. కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే బడుగు బలహీన వర్గాల జీవితాన్ని, వాళ్ల కన్నీళ్ళని, వాళ్ల ఆక్రందనను, వాళ్ల అనగారినితనాన్ని, అంటరానితనం వలన వాళ్ళు ఎదుర్కొన్న బాధలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. అటువంటి దర్శకులలో ప్రస్తుత కాలంలో అందరికీ టక్కున గుర్తుచే పేరు పా రంజిత్.

కొందరు దర్శకులు తమకంటూ ఒక మంచి పేరు సాధించుకోవాలి. జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఒక సరైన మార్పులు తీసుకురావాలి. కుల రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని ఆలోచనతో దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఆలోచించే దర్శకులలో ఒకరు పా రంజిత్. ఇప్పటివరకు రంజిత్ చేసిన సినిమాలన్నీ కూడా సమాజాన్ని ప్రశ్నించేలా ఉంటాయి. కొన్ని విషయాలను ఎత్తి చూపించేలా ఉంటాయి. సినిమా అంటే ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఉన్న ఒక ఆయుధం. అందుకనే స్టార్ హీరోలతో సైతం సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీసే ప్రయత్నం చేస్తాడు రంజిత్.

Pa. Ranjith

- Advertisement -

వాస్తవిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు

ఇక ఈ సినిమాలు తెరకెక్కించడానికి రంజిత్ వాస్తవిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలే కారణమని చెప్పాలి. ఒక సందర్భంలో భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోమనడం. ఊర్లో మర్రిచెట్టు అరుగు మీద కూర్చుంటే కిందకి తోసేయటం. కిరాణా షాప్ లో చాక్లెట్ కోసం డబ్బులు ఇస్తే విసిరి కొట్టడం. ఇలాంటి ఎన్నో సంఘటనలు వ్యక్తిగతంగా రంజిత్ ను బాధకు గురిచేసాయి. ఆ సంఘటనలకు కారణాలు రంజిత్ బాల్య వయసులో తెలియకపోయినా కూడా యుక్త వయసుకు వచ్చేసరికి సమాజం యొక్క రంగు బయటపడింది. దానిని మార్చే దిశగా సినిమా రంగం వైపు అడుగులు వేశాడు.

ఇన్స్పైర్ చేసిన రచనలు

అలెక్స్‌ హేలీ ‘రూట్స్‌’, మార్క్‌వెజ్‌ ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’ వంటి రచనలూ ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌’, ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’ వంటి సినిమాలూ కళ అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఆఫ్రో అమెరికన్‌లు- పాప్‌ సంగీతమూ సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్‌లోని దళితులూ అదే దారిలో ఎందుకు నడవకూడదనే లక్ష్యంతోనే కాలేజీలో చదివేటప్పుడే ఐదు నాటకాలు రాసి, బీఎఫ్‌ఏ పూర్తిచేశాక దర్శకుడు వెంకట్‌ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాడు.

రంజిత్ ఇప్పటివరకు ‘అట్టకత్తి’ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన తంగాలన్ వరకు అన్ని సినిమాల్లోనూ సొసైటీకి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు అనగారిన వర్గాల గురించి రంజిత్ మాట్లాడుతున్న మాట వాస్తవమే కానీ రంజిత్ లక్ష్యం కులరహిత సమాజమే అని చెబుతూ ఉంటాడు. కాస్ట్ లెస్ కలెక్టివ్ అని ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి ఇదే ప్రయత్నం చేస్తున్నాడు రంజిత్. చాలామందికి ఇది తెలియక రంజిత్ అటువంటి సినిమాలే చేస్తాడు అంటూ విమర్శల గుప్పిస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు