Pan India Movies : పాపం పాన్ ఇండియా హీరోయిన్లు… పేరుకే హీరోయిన్, పాపులర్ అయ్యేది మాత్రం ఇంకొకరు!

పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రావడం కోసం ఎంతోమంది హీరోయిన్లు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్లుగా కొనసాగుతున్న వాళ్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. వాళ్లు పేర్లకే పాన్ ఇండియా హీరోయిన్లు. కానీ వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాక క్రెడిట్ మొత్తం సినిమాలో ఉన్న సపోర్టింగ్ యాక్టర్స్ కే వెళ్ళిపోతుంది. మెయిన్ హీరోయిన్ కన్నా సపోర్టింగ్ రోల్స్ చేసే హీరోయిన్లకే ఎక్కువగా పాపులారిటీ దక్కుతోంది. దీంతో పాపం పాన్ ఇండియా హీరోయిన్లు అనక తప్పడం లేదు.

రీసెంట్ గా రిలీజ్ అయిన “యానిమల్” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ కు ముందు ఇక నెంబర్ వన్ హీరోయిన్ రష్మికనే అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ తీరా “యానిమల్” మూవీ థియేటర్లలోకి వచ్చాక రష్మిక మందన్నను మర్చిపోయి, సినిమాలో కీలక పాత్రలో నటించిన తృప్తి దిమ్రికి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హీరోయిన్ రష్మిక కన్నా ఈ అమ్మడికే సినిమా క్రెడిట్ అంతా దక్కింది.

ఇక తాజాగా విడుదలైన “సలార్” మూవీ విషయంలో కూడా అలాగే జరిగింది. “సలార్” మూవీలో హీరోయిన్ శృతిహాసన్ అన్న విషయం తెలిసిందే. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు శృతిహాసన్ కంటే ఎక్కువగా సపోర్టింగ్ రోల్ చేసిన శ్రియ రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో వరదరాజు సోదరి రాధా రామగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది శ్రియా రెడ్డి. “సలార్” మూవీలోని హైలెట్ పాయింట్స్ లో ఈమె కూడా ఒకరు అని చెప్పుకుంటున్నారు. ఇక శ్రీయ రెడ్డి విషయానికి వస్తే ఈ బ్యూటీ “అప్పుడప్పుడు” అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

అనంతరం విశాల్ హీరోగా నటించిన “పొగరు” సినిమాలో విలన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది. 2008లో నిర్మాత, నటుడు విక్రమ్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2018లో ప్రియదర్శని దర్శకత్వం వహించిన “సమ్ టైమ్స్” అనే మూవీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా “సలార్” మూవీలో కీలక పాత్ర పోషించిన శ్రియ రెడ్డి గురించి చర్చ నడుస్తోంది. అసలు ఆమె ఎవరు? అనే విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.

ఇక గతంలోనూ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన “బాహుబలి” సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఎక్కువగా హైలెట్ అయింది. కాకపోతే ఈ సినిమా ద్వారా అనుష్క కూడా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. రమ్యకృష్ణ ఎక్కడా అనుష్కను డామినేట్ చేయలేదు. ఇలా పేరుకు పాన్ ఇండియా హీరోయిన్లు అయినప్పటికీ వాళ్లకంటే సినిమాలో నటించిన ఇతర కీలక పాత్రధారులకు క్రెడిట్ అంతా దక్కుతూ ఉండడం విశేషం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు