Parvati Melton: బీచ్ లో హాట్ అందాలతో రెచ్చిపోయిన పవన్ బ్యూటీ..!

Parvati Melton..తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్ గా చాలా పద్ధతిగా కనిపించిన హీరోయిన్ పార్వతి మిల్టన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నెమ్మదిగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో స్టార్ హీరోల చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో నటించి అందులో తన పాత్ర గుర్తుండిపోయేలా నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు బికినీ ఫోటోలను, హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో అలజడులు సృష్టిస్తూ ఉంటుంది.

బోల్డ్ ఫోటోషూట్ తో వైరల్..

Parvati Melton: Pawan beauty excited by hot beauties on the beach..!
Parvati Melton: Pawan beauty excited by hot beauties on the beach..!

ఈ మధ్యకాలంలో పార్వతి మెల్టన్ మరింత అందాల ఆరబోతతో కుర్రకారును పిచ్చెక్కించేలా చేస్తోంది. గతంలో పోలిస్తే ఈ ముద్దుగుమ్మ పూర్తిగా మారిపోయి మరీ అందాల జోరు పెంచేసిందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది.. లుక్ పరంగా పార్వతి మెల్టన్ సరికొత్తగా కనిపిస్తోంది. అయితే గతంలో సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించిన పార్వతి మెల్టన్ ఈ ఫోటోలలో చూసి గుర్తించడం కష్టమే అంటూ పలువురు నెట్టిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. అమెరికన్ మోడల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. మొదట భరత నాట్యంతో పాటు పలు రకాల డ్యాన్సులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. అలాగే మిస్టీన్ ఇండియా బే ఏరియా పోటీ విజేతగా కూడా నిలిచిందట.

వెన్నెల సినిమాతో ఎంట్రీ..

2005 లో దేవా కట్ట డైరెక్షన్లో వచ్చిన వెన్నెల సినిమాలో.. హీరోగా రాజా నటించగా.. హీరోయిన్గా పార్వతి మెల్టన్ నటించింది.. అలాగే ఇందులో శర్వానంద్ కూడా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. 2006లో గేమ్ సినిమాలో నటించి.. ఆ తర్వాత మధుమాసం సినిమాలో కూడా నటించింది. చివరిగా 2012లో శ్రీమన్నారాయణ, యమహో యమ అనే చిత్రాలలో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అందాల ఆరబోత చేస్తూ .. వరుస ఫోటోలతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది పార్వతి మెల్టన్.

- Advertisement -

బీచ్ లో బికినీ అందాలు..

సోషల్ మీడియాలో చాలా కాలం తర్వాత ఇలాంటి బికినీ అందాలతో బీచ్ లో ఫోటోలను షేర్ చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. పార్వతి మెల్టన్ షేర్ చేసిన ఈ బికినీ ఫోటోలలో ఈమె అందాల విందు కనుల విందుగా చేసిందంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు సినిమాలలో తిరిగి రీఎంట్రీ ఇవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పార్వతి మిల్టన్ అప్పటికి ఇప్పటికి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఒకవేళ దర్శకుల కంట్లో పడితే కచ్చితంగా అవకాశాలు వస్తాయి అనడంలో కూడా సందేహం లేదు. మరి ఈమె రీ ఎంట్రీ ఇస్తుందా..? వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Parvati Melton (@parvatim)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు