Pavithra gowda: తల్లి మర్డర్ కేసు పై పవిత్ర గౌడ్ కుమార్తె షాకింగ్ కామెంట్స్..!

Pavithra Gowda.. కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో ఇరుక్కున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రేణుకా స్వామి అనే 28 ఏళ్ల యువకుడుని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్.. అతడి స్నేహితురాలు, నటి పవిత్ర గౌడ అరెస్టయ్యారు. ఈ హత్య కేసులో నటి పవిత్ర గౌడ మొదటి ముద్దాయి కాగా దర్శన్ రెండో ముద్దాయి.. పవిత్ర గౌడ దర్శన్ తో సహజీవనం చేస్తోందని.. ఆయన ఈమె మోజులో పడి తన భార్యకు అన్యాయం చేస్తున్నాడని.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన దర్శన్ వీరాభిమాని పవిత్ర గౌడ కు అసభ్యకర పదజాలాలతో కామెంట్లు చేసే వాడట.. ఇక దీంతో రేణుక స్వామి పై దాడి చేసి హత్య చేశారు..

తల్లి అరెస్ట్ తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్..

Pavithra Gowda: Shocking comments of Pavithra Gowda's daughter on mother's murder case..!
Pavithra Gowda: Shocking comments of Pavithra Gowda’s daughter on mother’s murder case..!

వాస్తవానికి దర్శన్ వయసు 47 ఏళ్లు.. పవిత్ర గౌడ వయసు 54 ఏళ్లు..అయితే గత పది సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.. ఈ విషయాన్ని పవిత్ర గౌడ స్వయంగా సోషల్ మీడియాలో రాసుకున్నారు కూడా.. పదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న పవిత్ర గౌడ కు దర్శన్ ఎన్నో ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చాడు.. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని… దర్శన్ లాయర్ అనిల్ వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ వివాద సమయంలో తాజాగా పవిత్ర కుమార్తె ఖుషి కూడా మొదటిసారి సోషల్ మీడియా ముందుకు వచ్చి స్పందించింది.

తల్లికి సపోర్ట్ చేస్తున్న పవిత్ర కుమార్తె..

ఇన్ని రోజులు మీడియా ముందుకు రాని పవిత్ర గౌడ కుమార్తె మొదటిసారి సోషల్ మీడియాలో. పోస్ట్ పెట్టింది ఫాదర్స్ డే సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తన తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసింది.. ఆ ఫోటోలో పవిత్ర తన కుమార్తె ఖుషి నుదురుపై ముద్దు పెట్టుకోవడం మనం చూడవచ్చు.. అంతే కాదు ఆ ఫోటోకి క్యాప్షన్ గా హ్యాపీ ఫాదర్స్ డే.. అన్ని నువ్వే అంటూ తన తల్లిని ట్యాగ్ చేసింది.. అంతే కాదు దాని పక్కనే ఈవిల్ ఐ, పింక్ హార్ట్ ఎమోజిని కూడా షేర్ చేసింది ఖుషీ. ఇక ఈ పోస్ట్ చూసిన వాళ్లంతా కూడా తల్లిని సపోర్ట్ చేస్తోందని.. తండ్రైనా.. తల్లి అయినా నువ్వేనని చెబుతోందని.. ఒక రకంగా తల్లికి మోరల్ సపోర్ట్ ఇస్తుందని కూడా చెబుతున్నారు..

- Advertisement -

నటి మాత్రమే కాదు మోడల్ కూడా..

ఇక పవిత్ర గౌడ విషయానికి వస్తే.. ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్.. అలాగే నటి కూడా.. టీవీ ఇండస్ట్రీ తో పాటు పలు సినిమాలలో కూడా నటించింది… 2016లో 54321 అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత ఛత్రిగాలు సార్ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతి కితాబు వంటి సినిమాలలో నటించిన ఈమె మోడల్ అలాగే ఆర్టిస్ట్ అని ఇంస్టాగ్రామ్ బయోలో తెలిపింది.. రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బోటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.. ఇక కొన్ని నెలల క్రితం ఈమె ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది దర్శన్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ మా బంధానికి పదేళ్లు అంటూ కామెంట్లు చేయడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు