Pavitra Lokesh – VK. Naresh: ఇన్నేళ్ళకు బయటపడ్డ అసలు రహస్యం.. అందుకే ప్రేమా. ?

Pavitra Lokesh – VK.Naresh.. సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండీగా మారే జంటలలో పవిత్ర లోకేష్, నరేష్ జంట ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ మధ్య సమంతాకు మించి వీరు సోషల్ మీడియాను షేక్ చేశారు.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని.. మళ్లీ పెళ్లి అంటూ వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి.. అయితే ఇప్పుడు తాజాగా వీరికి సంబంధించిన మరో విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్.. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి పేరు దక్కించుకున్నారు.. ముఖ్యంగా ఈయన కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.. ఈయన నటించిన చాలా సినిమాలు భారీ సక్సెస్ ను అందుకోవడమే కాదు ఆ సినిమాలు ఈయనను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.ఇకపోతే ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నరేష్.

పవిత్ర లోకేష్ – నరేష్ ప్రేమాయణం..

Pavitra Lokesh - VK. Naresh: The real secret that has come out all these years.. That's why Prema. ?
Pavitra Lokesh – VK. Naresh: The real secret that has come out all these years.. That’s why Prema. ?

ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో ఈయన సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరి వ్యవహారం అప్పుడే కాదు ఇప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.. ఇక వీరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే నిజమైన భార్యాభర్తల్లా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు.. అయితే ఈ వయసులో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? అసలు వీరింత క్లోజ్ గా ఉండడానికి గల కారణం ఏంటో? మాత్రం ఇప్పటికీ తెలియదు.. అయితే వీరిద్దరూ గిట్టని వారు మాత్రం కొంతమంది నరేష్ దగ్గర ఉన్న ఆస్తి చూసి పవిత్ర లోకేష్ అతడిని తన వలలో వేసుకుంది.. అంటూ కామెంట్లు మాత్రం చేస్తూ ఉంటారు.. కానీ వీరిద్దరి మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్.. ప్రేమ పుట్టడానికి గల రహస్యాలను మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు..

బయటపడ్డ అసలు రహస్యం..

కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ మాత్రం తమ ఇద్దరి మధ్య రిలేషన్ కి గల కారణాలు వెల్లడించారు.. నరేష్ మాట్లాడుతూ.. మా అమ్మ విజయనిర్మల పుట్టినరోజు, పవిత్ర లోకేష్ పుట్టినరోజు రెండూ ఒకటే.. ఇద్దరి బర్తడే ఫిబ్రవరి 20వ తేదీనే.. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపించింది. పవిత్ర కూడా మా అమ్మలాగే చాలా మంచిది.. స్ట్రాంగ్ ఉమెన్.. కానీ మా అమ్మ నాతో ఎప్పుడూ.. నీకు అన్నీ ఇచ్చాను కానీ నీకు మంచి తోడును ఇవ్వలేకపోయాను అంటూ చెప్పేది..అయితే పవిత్ర పరిచయం తర్వాత మా అమ్మ బెడ్ మీద పడుకొని ఉంది.. ఆమెకు అదే చివరి దశ.. నేను చెప్పాను అప్పుడు.. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నా జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది అని.. అప్పుడు అమ్మ సంతోష పడింది.. ఇక అలా అమ్మ సంతోషాన్ని చూసే.. నేను ఆమెతో బాండింగ్ మరింత పెంచుకున్నాను అంటూ తెలిపారు నరేష్.. ఇక ప్రస్తుతం నరేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే వీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సహజీవనం చేస్తున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు