Pawan Basamsetti : నాగ శౌర్యా.. ఇది కాన్ఫిడెన్సా..? గుడ్డినమ్మకమా?

Pawan Basamsetti : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నాగశౌర్య ఒకరు. అయితే నాగశౌర్య ఇప్పటికే దాదాపు పాతిక సినిమాలను పైగా చేశాడు. ఇది ఎవరు నమ్మలేరు. ఎందుకంటే నాగశౌర్య కెరియర్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. 2011లో క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు నాగశౌర్య.

ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చందమామ కథలు సినిమాలో రాజు అనే క్యారెక్టర్ ను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకుడుగా పరిచయమైన ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ లీడ్ గా చేసి హీరోగా తనను తాను నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.మళ్లీ నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన కళ్యాణ వైభోగమే సినిమా నాగశౌర్యకి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత 2016లో ఒక మనసు సినిమా కూడా ఓకే అనిపించింది. ఆ తర్వాత చేసిన జో అచ్యుతానంద, నీ జతలేక, కథలో రాజకుమారి సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి.

Naga Shaurya

- Advertisement -

బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఇంపాక్ట్ ను చూపించలేదు

అయితే నాగశౌర్యకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ఛలో అని చెప్పొచ్చు. వెంకీ కుడుముల దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత చేసిన కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. మళ్ళీ 2019లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమా మంచి హిట్ అయింది.అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అశ్వద్ధామ అనే సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత చేసిన వరుడు కావలెను సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన లక్ష్య సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇకపోతే నాగ శౌర్య చేసిన కృష్ణవింద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ ఒకరకంగా బాగానే ఆడాయి అని చెప్పొచ్చు.

ఈసారి పక్కా హిట్

అయితే నాగశౌర్య చేసిన లాస్ట్ ఫిలిం రంగబలి. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నాగశౌర్య అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా డిజాస్టర్ గానే మిగిలింది. ఇకపోతే రంగబలి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు పవన్ బాశంశెట్టి. శౌర్య ఇప్పుడు మళ్లీ పవన్ తో కలిసి సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది నాగశౌర్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ లేకపోతే మూర్ఖత్వం అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈసారి పక్కా హిట్ కొట్టబోతున్నట్టు ఇంకొన్ని కథనాలు వినిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫెయిల్ అయిన దర్శకుడికి రెండోసారి ఛాన్స్ ఇవ్వటం అనేది అరుదైన విషయం. ఆ కథ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప ఇంకో అవకాశం అనేది రాదు. మరి ఈసారైనా పవన్ నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడక తప్పదు. ఇకపోతే ఈ ప్రాజెక్టు గురించి అధికార ప్రతి ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు