Pawan Kalyan About Ramoji Rao: అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు

Pawan Kalyan About Ramoji Rao: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం చాలామందిని కలిచివేస్తుంది.చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు.

ఈ మృతి పట్ల పవన్ కళ్యాణ్ కూడా స్పందించి నివాళులు అర్పించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యాను. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. శ్రీ రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

Pawan Kalyan

- Advertisement -

ప్రజా పక్షం వహిస్తూ

శ్రీ రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు… ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు గారి దక్షతను తెలియచేసింది.

అలుపెరుగని పోరాటం

ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారు. మీడియా మొఘల్ గా శ్రీ రామోజీరావు గారు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీ రావు గారు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. శ్రీ రామోజీరావు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు