Pawan Kalyan: బన్నీ పక్కన చేరి పవనే రిజెక్ట్ చేసిన అనసూయ… ఫ్యాన్స్ రియాక్షన్ మామూలుగా లేదు భయ్యా..!

Pawan Kalyan: తెలుగు సినీ ప్రేక్షకులకు, బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. హాట్ యాంకర్ గా పేరు సంపాదించిన అనసూయ.. యాంకర్ కాకముందే పలు చిత్రాలలో చిన్నచిన్న క్యారెక్టర్లలో నటించినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు.. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లోకి వచ్చిందో తన ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఇందులో పొట్టి బట్టలలో గ్లామర్ ని వలకబోస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇలా జబర్దస్త్ తో వెండితెర పైన మళ్ళీ అవకాశాలను సంపాదించుకుంది అనసూయ. అలా స్టార్ హీరోల చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలలో నటించింది అనసూయ.

Pawan Kalyan: Anasuya joined Bunny and was rejected by Pawan...fan reaction is not normal bhai..!
Pawan Kalyan: Anasuya joined Bunny and was rejected by Pawan…fan reaction is not normal bhai..!

అనసూయ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

తాజాగా అనసూయ పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో నటించిన అనసూయ పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించింది. ఈ క్రేజ్ తోనే బుల్లితెరకు కూడా దూరమయ్యింది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తోంది.అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయకు అవకాశం ఇప్పించారు త్రివిక్రమ్.. కానీ ఈ అవకాశాన్ని అనసూయ వదులుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ చిత్రాలను రిజెక్ట్ చేసిన అనసూయ..

అయితే అనసూయ ఐటెం సాంగ్ వదులుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. స్పెషల్ సాంగ్ అంటే కేవలం తనతో మాత్రమే చేయాలని.. మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి డాన్స్ చేయడం అంటే తాను ఒప్పుకోనని తెలియజేసిందట. అలా అనసూయ కి బదులుగా.. ఖుషీ చిత్రంలో నటించిన ముంతాజ్ ను తీసుకురావడం జరిగింది. దీంతో అనసూయ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అయ్యి చాలా దారుణంగా కూడా ట్రోల్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు చేపట్టారు మరొకవైపు బన్నీ పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకలేదు అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు అనసూయని టార్గెట్ చేస్తూ.. అనసూయని నువ్వు మా హీరో కాలి గోటికి కూడా సరిపోవు అంటూ.. కామెంట్స్ చేయడం జరిగిందట.

- Advertisement -

మెగా ఫ్యామిలీ వల్లే గుర్తింపు కానీ అల్లూ గూటికి చేరి…

ఇకపోతే అనసూయ పై ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం అప్పట్లో ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇలా వెల్లడించింది.. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో తను నటించిన రంగమ్మత్త పాత్రకు మంచి పేరు తీసుకువచ్చిందని.. అందుచేతనే ఆఫర్స్ కూడా భారీగా పెరిగాయి.. అక్కడితో ఆగిపోకుండా తన దగ్గరకు వచ్చిన విభిన్నమైన పాత్రలలో కూడా నటిస్తూ ముందుకు వెళుతున్నానని తెలియజేసింది. ఏదేమైనా అప్పట్లో మెగా ఫ్యామిలీ వల్లే ఆఫర్లు దక్కించుకున్న ఈమె ఇప్పుడు బన్నీ సినిమాలలో అవకాశాలు దక్కించుకునేసరికి పవన్ కళ్యాణ్ సినిమాలను రిజెక్ట్ చేస్తోంది.. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెపై పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.. మరి దీనిపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు