Pawan Kalyan: ఇండస్ట్రీ లోకి రాకముందు.. ఫ్లోర్ క్లీన్ చేసి.. టీ కూడా తెచ్చి పెట్టేవారా..?

Pawan Kalyan..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా , మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సుపరిచితమే.. కానీ ఆయనలోని మరో యాంగిల్ బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కీలకంగా మారారు పవన్ కళ్యాణ్.. 21 స్థానాలలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తో విజయం అందుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సాధించిన విజయాన్ని చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించడమే కాదు.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ తుఫాన్ అంటూ ప్రశంసించారు.. ఎవరు ఊహించనంతగా ఏపీ ఎన్నికలలో జనసేన సునామీ సృష్టించింది… ఇప్పుడు ఎక్కడ విన్నా సరే పవన్ గురించి పలు వార్తలే వైరల్ అవుతున్నాయి. చాలామంది పవన్తో తమకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు కరాటే నేర్పిన మాస్టర్ షెహాని హుస్సేన్ కూడా తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్..

చెన్నై బేస్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ షెహనీ హుస్సేన్.. అనేక సినిమాలలో నటించారు కూడా.. ఆయన తనే పవన్ కు కరాటే నేర్పానని గర్వంగా చెప్పుకుంటున్నారు.. ముఖ్యంగా గురువు శిష్యుడు గురించి గర్వంగా చెప్పుకుంటున్న సమయం ఇది.. 1990 లలో ఇదంతా జరిగింది. ఆ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.. ఒక వ్యక్తి ఊరికే గొప్పవాడు కాదు.. దాని వెనుక పట్టుదల , కృషి ఉంటాయి.. అందుకు ఉదాహరణ నా శిష్యుడు పవన్ కళ్యాణ్ అంటూ చూపెడుతున్నారు కూడా..

టీ తెచ్చిపెట్టి, ఫ్లోర్ కూడా క్లీన్ చేసేవారు..

Pawan Kalyan: Before entering the industry, did you clean the floor and bring tea?
Pawan Kalyan: Before entering the industry, did you clean the floor and bring tea?

షెహనీ హుస్సేన్ మాట్లాడుతూ.. 1990లో నేను కరాటే నేర్పడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపడంలో బిజీగా ఉన్నాను. అయితే పవన్ కళ్యాణ్ దాదాపు నెలపాటు నా దగ్గరకు రోజు వచ్చి కరాటే నేర్పమని అడిగేవారు.. నేను ఏజెన్సీ పనుల్లో బిజీగా ఉండేవాడిని.. ఈ మధ్య కరాటే నేర్పించడం మానేశాను.. వెళ్ళిపో అని కూడా చెప్పాను.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటానని చెప్పి పట్టుబట్టి మరీ నేర్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక సామాన్యమైన వ్యక్తి లా టీ తెచ్చిపెట్టి, మాకు ఇచ్చేవారు.. నేను అతని ట్యూటర్ గా నన్ను చాలా గౌరవంగా చూసేవారు.. ఏ పని పడితే ఆ పని చేసేవారు.. కొన్నిసార్లు మా రూమ్ కూడా క్లీన్ చేసేవారు.. మాతోపాటు ఉండేవారు.. అలా ఏడాది పాటు నాతోనే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.. అప్పటికి పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు అనే విషయం తమకు తెలియదని హుస్సేన్ వెల్లడించారు..

- Advertisement -

మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్..

ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడని తెలిసే నాటికి ఆయన అన్ని పనులు చేసే వారని చెప్పుకొచ్చారు. దాదాపు మూడు నెలలు ఒక సామాన్య వ్యక్తి లాగా.. మా దగ్గర మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకొని తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.. ఆ తర్వాత మాకు మెగాస్టార్ తమ్ముడు కళ్యాణ్ కుమార్ అని తెలిసింది. పవన్ చాలా వేగంగా మార్చల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాదు మా దగ్గర ఉన్నప్పుడే బ్యాక్ బెల్ట్ కూడా సొంతం చేసుకున్నాడు అని హుస్సేన్ వెల్లడించారు.పవన్ కళ్యాణ్ లో ఏదో మ్యాజిక్ ఉందని.. అతను నాకు ఒక స్పెషల్ స్టూడెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ఉదయం 5:00 రాత్రి 11:30 వరకు హుస్సేన్ దగ్గరే పనిచేసేవారట పవన్ కళ్యాణ్.. ఇక అతడి పట్టుదల చూసి దాదాపు సంవత్సరం పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇకపోతే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను మనం తమ్ముడు సినిమాలో చూడవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు