Pawan Kalyan: బంపర్ ఆఫర్ కొట్టేసిన కమెడియన్.. త్వరలో ఆ పదవి..!

Hyper Aadi.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే.. నిజానికి జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఒకవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.. ముఖ్యంగా ఈ షో ద్వారానే హైపర్ ఆది జీవితంలో బాగా సెటిల్ అయ్యారు.. వీలైనప్పుడల్లా మెగా హీరోలపై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.. ఇక ఈ విషయమే ఆయనను మెగా అభిమానులకు దగ్గర చేసింది.. ముఖ్యంగా వైసిపి నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసే కారుకూతలకు ఈయన గట్టి సమాధానంతో పాటు కౌంటర్ కూడా ఇచ్చేవాడు.ప్రస్తుతం ఇదే హైపర్ ఆదిని పవన్ కళ్యాణ్ కు దగ్గర చేసింది..

ఆది కష్టానికి పవన్ కళ్యాణ్ ఇచ్చే బహుమతి..

Pawan Kalyan: Comedian who got a bumper offer.. Soon that position..!
Pawan Kalyan: Comedian who got a bumper offer.. Soon that position..!

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి డిప్యూటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన పార్టీ కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కష్టపడ్డ హైపర్ ఆదికి మంచి పదవి ఇచ్చి గౌరవించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి హైపర్ ఆదికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తూ వున్నాయి.. ఈ రకంగా తనను నమ్ముకుంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయనే సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే హైపర్ ఆదికి ఇలా ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే. అయితే ఈ విషయం నిజం కావాలని హైపర్ ఆది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

100 % స్ట్రైక్ సక్సెస్..

జనసేన పార్టీ విషయానికి వస్తే.. 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగారు.. అంతేకాదు కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు కేటాయించగా.. 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా ఏపీలో గుర్తింపు దక్కించుకుంది.. మొత్తంగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. హైపర్ ఆది సహా పార్టీ కోసం పనిచేసిన సినిమా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏదిఏమైనా ఒకవేళ ఈ వార్త ప్రకారం హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే కచ్చితంగా జనసేన ను ప్రచారం చేయడానికి చాలామంది ముందుకొస్తారనటంలో సందేహం లేదు

- Advertisement -

జబర్దస్త్..

జబర్దస్త్ విషయానికి వస్తే.. బుల్లితెరపై ప్రముఖ కామెడీ షోగా గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు.. ముఖ్యంగా టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ వేదిక చాలా బాగా పనిచేసింది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ షోలో కమెడియన్లుగా పనిచేసిన చాలామంది సినిమాలలో ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈయన రాజకీయాలలోనే కొనసాగుతారా లేక ఇండస్ట్రీకి వస్తారా అనేది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు